Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
నోరూరించే స్టఫ్డ్ పాలక్ పనీర్ ఇడ్లీ..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో
దక్షిణ భారతదేశంలో ఇడ్లీ అంటే తెలియని వారు ఉండరు. ఉదయం టిఫిన్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మృదువైన, వేడివేడి ఇడ్లీలే. కానీ రోజు తినే సాదా ఇడ్లీలకు కాస్త భిన్నంగా, మరింత రుచికరంగా,ఆరోగ్యకరంగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే స్టఫ్డ్ పాలక్ పనీర్ ఇడ్లీ తినాల్సిందే.
పాలకూరలోని పోషకాలు, పనీర్ లోని ప్రొటీన్ కలగలిసిన ఈ ఇడ్లీలు పిల్లల లంచ్ బాక్స్‌కి, పెద్దల బ్రేక్ ఫాస్ట్ కి ఒక అద్భుతమైన ఎంపిక. ఆకుకూరలు తినడానికి మారం చేసే పిల్లలు కూడా ఈ ఇడ్లీలను ఇష్టంగా లాగించేస్తారు. స్టఫ్డ్ పాలక్ పనీర్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఇడ్లీ బియ్యం: 1 కప్పు
మినపప్పు: అర కప్పు
మెంతులు: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
పాలకూర: అర కప్పు
పనీర్ : అర కప్పు (తురిమినది)
ఉల్లిపాయ: 1 చిన్నది
పచ్చిమిర్చి: 1
అల్లం: అర టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
నూనె: తాలింపుకు సరిపడా
తయారీ విధానం
-మొదటగా మినపప్పు, ఇడ్లీ బియ్యం, మెంతులను విడివిడిగా శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వీటిని వేర్వేరు గిన్నెలలో తగినంత నీరు పోసి సుమారు 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి.
-పప్పు బాగా నానిన తర్వాత, బియ్యం, పప్పును విడివిడిగా గ్రైండర్ లేదా మిక్సీలో వేసి మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలను ఒక గిన్నెలో వేసి, రుచికి సరిపడా ఉప్పు కలిపి, బాగా మిక్స్ చేసి సుమారు 6-8 గంటలు లేదా రాత్రంతా పక్కన పెట్టండి.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక తరిగిన పాలకూర, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన అల్లం, చిటికెడు ఉప్పు వేసి వేయించాలి.
-పాలకూరలోని పచ్చి వాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు ఉడికించాలి. చివరగా తురిమిన పనీర్ వేసి అన్నీ బాగా కలిసేలా ఒక్క నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసుకుని వాటి గుంతలకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని కొద్దిగా (గుంతలో సగం వరకు) పోయాలి. దానిపై తయారు చేసుకున్న పాలక్ పనీర్ మిశ్రమాన్ని ఒక స్పూన్ ఉంచాలి.
-ఇడ్లీ పాత్రలో నీరు పోసి వేడి చేసి ఇడ్లీ స్టాండ్ ను అందులో ఉంచండి. మూత పెట్టి మీడియం మంటపై 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఇడ్లీలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ లేదా చాకుతో గుచ్చి చూడండి, పిండి అంటుకోకపోతే ఇడ్లీలు తయారైనట్లే.
-స్టవ్ ఆపి, వేడి వేడి ఇడ్లీలను ప్లేట్ లోకి తీసుకొని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్ తో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications