Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
చుక్క నూనె లేకుండా ప్రొటీన్ రిచ్ కర్రీ.. ఇలా చేస్తే ఉత్తి గ్రేవీనే తినేస్తారు.!
వయసు పైబడిన వారు, బరువు తగ్గాలనుకునేవారు వంటల్లో నూనెని తక్కువగా ఉపయోగిస్తుంటారు. నూనె పదార్థాలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందనేది వాస్తవం. అలాంటి వారి కోసం అసలు చుక్క నూనె కూడా వాడకుండా రుచికరమైన, హెల్తీ క్రీమీ గ్రేవీని ఇక్కడ అందిస్తున్నాం. ఎలా చేయాలంటే..

జీరో ఆయిల్ క్రీమీ గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు
పెసర్లు- కప్పు
క్యారెట్- ఒకటి
గుమ్మడి కాయ ముక్కలు- అర కప్పు
ఉల్లిపాయ- ఒకటి
బాదం- రెండు
క్రీమ్ తక్కువగా ఉన్న పనీర్- 200 గ్రాములు
మఖానా- అర కప్పు
జీరో ఆయిల్ క్రీమీ గ్రేవీ తయారు విధానం
ముందుగా పెసర్లను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్, ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకుని అందులో కప్పు నీళ్లు పోసి పెసర్లు వేసుకోవాలి. మరో చిన్న గిన్నెలో ఉల్లిపాయ, క్యారెట్, గుమ్మడి ముక్కలు, బాదం తీసుకుని కుక్కర్‌లోనే పప్పు పైన ఆ గిన్నె పెట్టి ఆవిరిపైన రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు మిక్సీ తీసుకుని అందులో ఉడికించిన క్యారెట్, గుమ్మడి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటితో పాటు పనీర్, మఖానా, బాదం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం స్టవ్‌పైన ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక ఈ పేస్ట్‌ను అందులో వేసి పచ్చివాసన పోయేవరకు ఉడికించాలి.
ఐదు నిమిషాల తర్వాత పెసర్లను అందులో వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవచ్చు. గ్రేవీ చిక్కగా అయ్యేవరకు కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే చుక్క నూనె కూడా ఉపయోగించకుండా రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు గ్రేవీ రెడీ. చపాతీలోకి ఈ డిష్ అదిరిపోతుంది.
జీరో ఆయిల్ క్రీమీ గ్రేవీలో ఉండే పోషకాలు
గుమ్మడికాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ ఏ కంటి చూపునకు దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది.
పూల్ మఖానా అంటే తామర గింజల్లో కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి పర్ఫెక్ట్ ఎంపిక. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం మినరల్స్ కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గించడంతో పాటు ఎముకలు, దంతాల దృఢత్వానికి దోహదపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
