Latest Updates
-
ఆ కంపెనీలో హస్తప్రయోగం చేసుకోడానికి అరగంట బ్రేక్! -
హిందూ ధర్మంలో అగ్ని ఎందుకు పవిత్రంగా భావించబడుతుంది? -
జలై 1నే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? 2026 థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత -
జూలై 2న కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి తిరుగేలేదు, ఎవరికి జాగ్రత్త? -
National Doctor's Day 2026: తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి -
జూలై 1 శాలరీ డే: ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
మీ చిన్నారి చేతిలో దెబ్బలు తింటున్నారా? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
మన పూర్వీకులు తిన్న బ్రేక్ ఫాస్ట్ ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి, ఇలా చేసుకోండి -
ధనిష్ఠ నక్షత్రంలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, ధనలాభం ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - బుధవారం, 01 జూలై 2026
పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి రావాలా? ప్రోటీన్ రిచ్ సోయా పుదీనా రైస్ చేసి పెట్టండి!
ఉదయం నిద్ర లేవగానే ప్రతి తల్లికి ఎదురయ్యే అతి పెద్ద సమస్య..ఈ రోజు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి?. పిల్లలు ఇష్టంగా తినాలి, అదే సమయంలో రోజంతా చురుకుగా ఉండటానికి వారికి కావాల్సిన పోషకాలు కూడా అందాలి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు ప్రోటీన్ చాలా అవసరం. కానీ హెల్తీ ఫుడ్ అనగానే పిల్లలు ముఖం తిప్పుకుంటారు. అలాంటి తల్లుల టెన్షన్ తగ్గించడానికి, పిల్లలకి కావాల్సిన ప్రోటీన్ ను అందించడానికి ఒక అద్భుతమైన రెసిపీ సోయా పుదీనా రైస్.

సోయా చంక్స్ (మీల్ మేకర్)లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మాంసహారానికి దీటుగా ఇందులో పోషకాలు ఉంటాయి. కానీ సోయా చంక్స్ ను డైరెక్ట్ గా కూరలా వండితే చాలా మంది పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు. వారి చేత సోయాను తినిపించాలంటే ఇలా ఓ స్మార్ట్ ట్రిక్ ప్లే చేయాలి. పుదీనా, కొత్తిమీరల తాజాదనం, సువాసనలతో ఈ రైస్ ను ఫ్లేవర్డ్ రైస్ లా వండితే.. పిల్లలు అందులో సోయా ఉందన్న సంగతి మర్చిపోయి లొట్టలేసుకుంటూ మరీ తినేస్తారు. లంచ్ బాక్స్ ఖాళీ అవ్వడం ఖాయం.
సోయా పుదీనా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పుదీనా ఆకులు - 1 కప్పు
కొత్తిమీర - 1 కప్పు
పచ్చిమిర్చి - 2 నుండి 3 (కారాన్ని బట్టి)
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 4 నుండి 5
బిర్యానీ మసాలా దినుసులు (చెక్క, లవంగాలు, యాలకులు) - కొద్దిగా
షాజీరా -అర టీస్పూన్
మీల్ మేకర్- 1 కప్పు
బియ్యం - 1 కప్పు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకు- 1
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 3 కప్పులు

సోయా పుదీనా రైస్ తయారీ విధానం
-ముందుగా అరగంట పాటు బియ్యం నానబెట్టుకోవాలి
-మీల్ మేకర్ ను ఉడికించి నీరు పిండి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా (గ్రీన్ మసాలా) రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ లేదా అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టి, అందులో నెయ్యి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు, షాజీరా వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు సన్నని మంటపై వేయించాలి.
-మసాలా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు, ముందుగా ఉడికించి నీళ్లు పిండేసిన సోయా చంక్స్ అందులో వేసి బాగా కలపాలి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ సోయాకు పట్టేలా రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి, రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. చివరగా 3 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి. కుక్కర్ అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది.
-ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే.. ఇల్లంతా ఘుమఘుమలాడే సోయా పుదీనా రైస్ రెడీ. చూడటానికి ఆకుపచ్చ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ రైస్ ను పెరుగు రైతాతో కలిపి లంచ్ బాక్స్ లో పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications