Latest Updates
-
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
లొట్టలేసుకుంటూ తినే పూర్ణం బూరెలు..ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ షేపులో వస్తాయి,టేస్ట్ అదరహో
సాధారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగల సందర్భంగా తయారుచేసే సంప్రదాయ స్వీట్ పూర్ణం బూరెలు. తింటుంటే ఎన్నైనా తినాలపించే రుచి దీని సొంతం. ఈ సంప్రదాయ దక్షిణ భారత స్వీట్ ని చాలా ఈజీగా తయారుచేసుకొని తినవచ్చు. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. తీపి అంటే కొంచెం దూరంగా ఉండేవాళ్లు కూడా పూర్ణం బూరెలు అంటే పరుగెత్తుకొస్తారు. వరలక్ష్మీ వ్రతం సమయంలో దీనిని ఎక్కువగా తయారుచేస్తుంటారు. పూర్ణం బూరెలు ఇంట్లో తయారుచేసుకోడానకి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పూర్ణం బూరెలు తయారీకి కావలసిన పదార్థాలు
-మినపప్పు
-రవ్వ
-శెనగపప్పు
-బియ్యం పిండి
-చక్కెర
-ఉప్పు
-బెల్లం
-ఆయిల్
-నెయ్యి

పూర్ణం బూరెలు తయారీ విధానం
-ముందుగా 1 కప్పు మినపప్పుని కనీసం 4-5 గంటలు నానబెట్టుకోవాలి. 1 కప్పు శెనగపప్పుని, 1కప్పు రవ్వను విడి విడిగా అరగంటసేపు నానబెట్టుకోవాలి.
-1 కప్పు బియ్యం పిండిలో కొంచెం నీళ్లు పోసి అర గంటసేపు నానబెట్టుకోవాలి
-నానిన శెనగపప్పుని కుక్కర్ లో వేసి ఇందులోనే మూడు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
-ఇప్పుడు మిక్సీలో నానబెట్టిన మినపప్పు, కొద్దిగా చక్కెర వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నానబెట్టిన రవ్వ,నానబెట్టిన బియ్యం పిండి, ఉప్పు వేసి కలిపి పక్కన వేసుకోవాలి.
అన్నం,చపాతీ ఎందులోకైనా అదిరిపోయే వంకాయ మామిడిపప్పు..ఎలా చేసుకోవాలో చూడండి
-తర్వాత ఉడికిన పప్పులో నీరు అంతా పూర్తిగా వంచేసి పప్పుని బాండీలో వేసి గరిటతో మెదుపి అందులో 1 కప్పు బెల్లం తురుము వేసి దగ్గరకు అయ్యేదాకా ఉడికించాక అందులో కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ యాలకల పొడి వేసి కలుపి దించేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఈ పూర్ణాన్ని బాల్స్ లా చుట్టుకొని పక్కనపెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడయ్యాక పూర్ణం బాల్స్ ని ముందుగా రెడీ చేసి పక్కనపెట్టుకున్న పిండి మిశ్రమంలో ముంచి ఆయిల్ లో వేసుకోవాలి. రెండు పక్కలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకుంటే చాలు. పూర్ణం బూరెలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
