Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
వినాయక చవితి స్పెషల్ ప్రసాదం ఇదే..ఎలా చేసుకోవాలంటే
హిందువులు పెద్ద ఎత్తున జరుపుకునే అతిముఖ్యమైన పండుగ..వినాయక చవితి. మారుమూల పల్లె నుంచి హిందువులు ఉన్న ప్రతిదేశంలో వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతాయి. వినాయక చివితి సమయంలో విఘ్నేశ్వరుని పూజించడానికి, దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ నైవేద్యాలలో మోదకాలు, ఉండ్రాళ్లు ఎంత ముఖ్యమో, రవ్వ కేసరి కూడా అంతే ప్రధానమైనది.
వినాయక చవితి రోజున గణపతికి ఇష్టమైన తీపి ప్రసాదాలలో రవ్వ కేసరి ఒకటి. దీనిని ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వతో తయారు చేస్తారు. కేసరి అంటే కాషాయ రంగు అని అర్థం. దీనికి కేసరి రంగు రావడానికి కుంకుమపువ్వు, ఫుడ్ కలర్ ఉపయోగిస్తారు. పండుగలకు, శుభకార్యాలకు, అతిథులు వచ్చినప్పుడు త్వరగా తయారు చేయదగిన స్వీట్ ఇది. రవ్వ కేసరి కేవలం రుచికరమైన ప్రసాదమే కాదు, దీని వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. రవ్వ కేసరిని మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

రవ్వ కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి
-జీడిపప్పు
-ఎండుద్రాక్ష
-పచ్చ కర్పూరం
-యాలకల పొడి
-కుంకుమ పువ్వు
-బొంబాయి రవ్వ
-ఫుడ్ కలర్
-వేడి నీళ్లు
-చక్కెర
రవ్వ కేసరి తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పావుకప్పు నెయ్యి వేసి వేడి చేసి అందులో పావు కప్పు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.
తర్వాత అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి తక్కువ మంట మీద బంగారు రంగు వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
వేగిన రవ్వలో 3 కప్పుల వేడి వేడి నీళ్లు పోసి రవ్వను పూర్తిగా ఉడకనివ్వాలి.
రవ్వ ఉడికేలోగా ఓ చిన్న గిన్నెలో చిటికెడు కుంకుమపువ్వు, చిటికెడు ఫుడ్ కలర్ వేసి నీళ్లు పోసి కలిపండి.
ఉడికిన రవ్వలో కలిపిన ఫుడ్ కలర్ కుంకుమ పువ్వు మిశ్రమం వేసి కలపండి.
తర్వాత అందులో ఒకటిన్నర కప్పు చక్కెర వేసి కలుపుతూ దగ్గరపర్చాలి.
ఇప్పుడు అందులో చిటికెడు పచ్చ కర్ఫూరం, పావు టీస్పూన్ యాలకల పొడి, పావు కప్పు నెయ్యి వేసి కలిపి నెయ్యి పైకి తేలేదాకా నిదానంగా ఉడికించాలా. అంతే రవ్వ కేసరి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
