Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్‌స్టంట్ ఫిష్ ఫ్రై.!
నాన్ వెజ్ ప్రియుల్లో చేపల కూరకి ఎంత క్రేజ్ ఉంటుందో.. చేపల వేపుడుకీ అంతే క్రేజ్ ఉంటుంది. అన్నం, చపాతీలు, రోటీల్లోకి ప్రతి బైట్‌నూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే చికెన్, మటన్ వండినంత సులభంగా చేపలను వండలేం. ముక్క చినగకుండా, గ్రేవీ చిక్కగా, రుచికరంగా ఉండేలా ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో టైం లేనప్పుడు ఎంతో హడావుడి పడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎక్కువ శ్రమ లేకుండా ఇన్‌స్టంట్‌గా ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు.

చేపల కూరలో వాడే పదార్థాలు ఒక్కటీ తగ్గకుండా రుచికరంగా, ఘాటుగా ఉండేలా ఇన్‌స్టంట్ ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు. అటు వేపుడుని తలపిస్తూ ముక్కలు, ఇటు పులుసును తలపిస్తూ గ్రేవీ తయారవుతుంది. మొట్టమొదటిసారి చేసేవారే కాకుండా బ్యాచ్‌లర్స్ సైతం సింపుల్‌గా చేసుకోవచ్చు.
జలుబు, దగ్గుని ఒక్కరోజులో మాయం చేసే పాతకాలంనాటి ఘాటైన రసం.. ఐదే నిమిషాల్లో రెడీ
ఇన్‌స్టంట్ ఫిష్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
చేపలు- అరకేజీ
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర- టీస్పూన్
కారం- టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
నల్ల మిరియాల పొడి- అర టీస్పూన్
పసుపు- అర టీస్పూన్
ధనియాల పొడి- అర టీస్పూన్
జీలకర్ర పొడి- అర టీస్పూన్
మెంతి పొడి- అర టీస్పూన్
ఉల్లిపాయ- ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీస్పూన్
కరివేపాకు- కొద్దిగా
చింతపండు- నిమ్మకాయ సైజు
కొత్తిమీర- కొద్దిగా
ముందుగా చేపలను ఉప్పు, నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చింతపండుని కడిగి ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి కడాయి లేదా పాన్‌లో నూనె వేసి కాగనివ్వాలి.
నూనె కాగిన తర్వాత జీలకర్ర, కారం, రుచికి సరిరడా ఉప్పు వేసి కలపాలి. తర్వాత నల్ల మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి మొత్తం కలిసేలా మాడిపోకుండా కలుపుకోవాలి.

ఇప్పుడు ఉల్లిపాయను చాలా చిన్న ముక్కలుగా అంటే తురిమినట్లుగా కట్ చేసుకుని ఈ స్టఫ్‌లో వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. కొద్దిగా కరివేపాకు వేసి కలపాలి.
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.!
నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి ఈ గ్రేవీలో పోసి కలపాలి. కాసేపు ఉడికిన తర్వాత చేప ముక్కలను కాస్త గ్యాప్ ఉండేలా కడాయిలో వేసుకోవాలి.
మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరోవైపు తిప్పి వేగనివ్వాలి.
చేప ముక్కల నుంచి నీచు వాసన పోయి బాగా ఉడికి గట్టిగా అయ్యే వరకు ముక్కను పైకి కిందికీ తిప్పుతూ ఉండాలి. గ్రేవీ మాడిపోకుండా చూసుకోవాలి.
చేప ముక్కలు ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఇన్‌స్టంట్ ఫిష్ ఫ్రై రెడీ. ఎలాంటి మారినేషన్ అవసరం లేకుండా కమ్మగా, ఘాటుగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
