Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అద్భుతమైన రుచి, అమోఘమైన ఆరోగ్యం.. కొర్రల సాంబార్ అన్నం ఎలా చేసుకోవాలంటే
ప్రతిరోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? రోజూ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా వంటివి బోర్ కొట్టేశాయా? అయితే ఓ సారి కొర్రలతో చేసే సాంబార్ అన్నం ట్రై చేయండి. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది. ఉద్యోగాలకు వెళ్లేవారికి, ఉదయం పూట హడావుడిగా ఉండే వారికి ఈ వంటకం ఒక వరం లాంటిది. ఒక్క కుక్కర్ లోనే అన్నం, పప్పు, కూరగాయలు అన్నీ కలిసి ఉడికిపోతాయి. దీనివల్ల వంట పని త్వరగా పూర్తవడమే కాకుండా, శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఒకేసారి అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ వంటం. నోరూరించే కొర్రల సాంబార్ అన్నం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
-కొర్రలు (వరిగలు/అరికలు) - అర కప్పు
-కందిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
-నూనె - 2 టేబుల్ స్పూన్లు
-నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
-ఆవాలు, జీలకర్ర - 1 టీస్పూన్
-మినపప్పు, శనగపప్పు - అర టీస్పూన్ చొప్పున
-ఎండు మిర్చి - 1
-పచ్చిమిర్చి - 2
-కరివేపాకు - ఒక రెమ్మ
-ఇంగువ - పావు టీస్పూన్
-ఉల్లిపాయ - 1
-టమాటా - 2
-కూరగాయ ముక్కలు - 1 కప్పు (క్యారెట్, బీన్స్, బంగాళాదుంప, వంకాయ)
-పసుపు - పావు టీస్పూన్
-సాంబార్ పొడి - 2 టేబుల్ స్పూన్లు
-చింతపండు - చిన్న నిమ్మకాయంత
-ఉప్పు - రుచికి సరిపడా
-నీళ్ళు - మూడున్నర కప్పులు
-కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా కొర్రలు, కందిపప్పును శుభ్రంగా రెండుసార్లు కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి పోపు చిటపటలాడనివ్వాలి.
-ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి.
-తర్వాత టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి అవి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.
-ఇప్పుడు క్యారెట్, బీన్స్, బంగాళాదుంప, వంకాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తర్వాత పసుపు, సాంబార్ పొడి వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
-ఇప్పుడు మూడున్నర కప్పుల నీళ్లు, చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు, నానబెట్టుకున్న కొర్రలు-కందిపప్పు మిశ్రమాన్ని నీళ్లతో సహా వేసి కలపాలి.
-కుక్కర్ మూత పెట్టి, మీడియం మంట మీద 4-5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
-ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి, చివరగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపితే ఘుమఘుమలాడే కొర్రల సాంబార్ అన్నం రెడీ. వేడివేడిగా ఈ సాంబార్ అన్నాన్ని అప్పడాలు లేదా వడియాలతో తింటే ఆ రుచే అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





