Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
పోషకాల గని..డిన్నర్ లోకి హెల్తీ బ్రోకలీ చీజ్ పరాఠా..ఒక్క ముక్క కూడా మిగల్చరు!
ప్రతిరోజూ రాత్రి డిన్నర్ కి ఏమి వండాలి? అందులోనూ పిల్లలు మారాం చేయకుండా, ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన వంటకం ఏముంటుంది? అని ఆలోచిస్తున్నారా? అయితే బ్రోకలీ చీజ్ పరాఠా ట్రై చేయండి. సాధారణంగా పిల్లలు ఆకుకూరలు, కూరగాయలు తినడానికి ఆసక్తి చూపరు. ముఖ్యంగా బ్రోకలీ అనగానే ఆమడదూరం పరుగెడతారు. కానీ దానికి కమ్మని చీజ్ జోడించి పరాఠా రూపంలో ఇస్తే.. ఒక్క ముక్క కూడా మిగల్చకుండా లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, పోషకాల గని కూడా.

బ్రోకలీ చీజ్ పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: 1 కప్పు
బ్రోకలీ తురుము: 1 కప్పు
చీజ్: అర కప్పు
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 1
వాము: అర టీస్పూన్
నల్ల మిరియాల పొడి: అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్: 1 టీస్పూన్
ఒరేగానో: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి లేదా నూనె: పరాఠాలు కాల్చడానికి సరిపడా
బ్రోకలీ చీజ్ పరాఠా తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా నీళ్లు పోసి మృదువుగా చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు తాజా బ్రోకలీని తీసుకుని శుభ్రంగా కడిగి, వేడి నీటిలో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి. బ్రోకలీ మెత్తబడిన తర్వాత, నీటిని వంపేసి దానిని సన్నగా తురుముకోవాలి.
-పరాఠాకు ప్రాణం దాని లోపల ఉండే స్టఫింగ్. ఒక పెద్ద గిన్నెలో తురిమిన బ్రోకలీ, కమ్మని చీజ్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఆ తర్వాత అందులో వాము, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్ని పదార్థాలు కలిసేలా బాగా కలుపుకోవాలి.
-కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని గిన్నె ఆకారంలో (మధ్యలో మందంగా, అంచులు పలచగా) చేసుకోవాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న బ్రోకలీ-చీజ్ మిశ్రమాన్ని తగినంత నింపాలి. మిశ్రమం బయటకు రాకుండా అంచులు మూసివేసి ముడిలా చేయాలి. ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ పరాఠాను నెమ్మదిగా, జాగ్రత్తగా గుండ్రంగా ఒత్తుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం (తవా) పెట్టుకుని వేడి చేయండి. పెనం వేడెక్కాక ఒత్తి పెట్టుకున్న పరాఠాను వేసి రెండు వైపులా నెయ్యి లేదా నూనె రాస్తూ కాల్చండి. పరాఠాకు మంచి బంగారు గోధుమ రంగు వచ్చి, కరకరలాడేంత వరకు సన్నని మంట మీద కాల్చుకుంటే అద్భుతమైన రుచి వస్తుంది.
-ఎంతో కమ్మని బ్రోకలీ చీజ్ పరాఠా రెడీ. దీనిని వేడివేడిగా పెరుగు, టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో వడ్డిస్తే రుచి అదరహో అనాల్సిందే.
బ్రోకలీ చీజ్ పరాఠా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బ్రోకలీలో ఫైబర్ (పీచుపదార్థం), విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్రోకలీ మేలు చేస్తుంది. ఇక ఇందులో వాడే చీజ్ వల్ల క్యాల్షియం అంది ఎముకలు బలోపేతం అవుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications