కొండల్ని పిండి చేసే బలాన్నిచ్చే మొలకల పాలు..ఎలా చేసుకోవాలంటే

Posted By:

మొలకల పాలు అనేది మొలకెత్తిన గింజలు, పప్పుల నుండి తయారుచేసే ఒక పోషకమైన, రుచికరమైన పానీయం. మొలకల పాలు కేవలం ఒక పానీయం కాదు, అది ఆరోగ్యం, శక్తి, పోషణ కలగలిసిన ఒక అద్భుతమైన వరం. దీనిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మొలకల పాలు కేవలం రుచికరంగా ఉండటమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం,గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట నిండకుండానే పోషకాలు అందడానికి, ఎముకల బలానికి,బరువును అదుపులో ఉంచుకోడానికి,రోగనిరోధక శక్తిని పెంచుకోడానికి సాయపడుతుంది. మొలకల పాలు ఇంట్లోనే ఎలా తయారుచేయాలో ఇక్కడ చూడండి.

మొలకల పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు

-రాగులు
-జొన్నలు
-సజ్జలు
-జీడిపప్పు
-బాదంపప్పు
-అల్లం
-యాలకలు
-పిస్తాపప్పు
-గుమ్మడి గింజలు
-వాల్ నట్స్
-పాలు
-నీళ్లు

మొలకల పాలు తయారీ విధానం

-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు రాగులు, 1 కప్పు జొన్నలు, 1కప్పు సజ్జలు వేసి వాటిని శుభ్రంగా కడిగి 10 గంటలు నానబెట్టి మూతకట్టండి.

-3 రోజుల తర్వాత మూత ఓపెన్ చేస్తే మొలకలు వస్తాయి. వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఓ క్లాత్ మీద వేసి 2 గంటలు ఆరనివ్వాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో మొలకలు వేసి 15 నిమిషాలు సన్నని సెగ మీద దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.

-తర్వాత అదే పాన్ లో జీడిపప్పు,బాదంపప్పు, పిస్తాపప్పు,గుమ్మడి గింజలు, వాల్ నట్స్ ,కొద్దిగా అల్లం, నాలుగు యాలకలు వేసి వేయించి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మిక్పీ గిన్నెలో వేయించిన డ్రైఫ్రూట్స్,మొలకలు మొత్తం వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి.

-ఈ పిండిని కొద్దిగా గ్లాస్ లో వేసి నీళ్లు పోసి బాగా కలపండి.

-తర్వాత స్టవ్ మీద కొద్దిగా వేడి నీళ్లు మరిగించి అందులో ఈ పిండి కలిపిన నీళ్లను పోసి మొత్తం బాగా కలపండి. ఇందులోనే వేడి చేసిన పాలను కలిపి తాగండి. అంతే ఆరోగ్యకరమైన మొలకల పాలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, July 8, 2025, 11:02 [IST]
Desktop Bottom Promotion