Latest Updates
-
జలుబు వల్ల వచ్చే తీవ్రమైన తలనొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే -
నార్త్ ఇండియా స్టైల్ పుట్టగొడుగులు బంగాళదుంప మసాలా..తరతరాలకు గుర్తుండిపోయే రుచి! -
విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి సూప్..చలికాలంలో దీన్ని మించింది లేదు! -
పురుషుల దినోత్సవం స్పెషల్ స్వీట్..నోట్లో వెన్నలా కరిగిపోయే క్రీమీ రబ్రీని ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
చాక్లెట్ బ్రౌనీ చీజ్ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి! -
International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే! -
పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! -
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా.. -
చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! -
కేరళ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్లు కూడా చిటికెలో చేసేయొచ్చు!
జొన్న రొట్టె, చపాతీకి అదిరిపోయే సైడ్ డిష్..గుజరాత్ ఫేమస్ కారప్పూస టమాటో కర్రీ..ఎలా చేయాలంటే..
వంట చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించకుండానే, వేడివేడిగా,రుచికరమైన కర్రీ చేసుకోవాలనుకుంటే గుజరాత్ లోని కతియావాడి స్పెషల్ కారప్పూస టమాటో బెస్ట్ ఆప్షన్. కేవలం గుజరాత్‌లోనే కాకుండా రాజస్థాన్, మహారాష్ట్రల్లోనూ ఎంతో ప్రజాదరణ పొందిన కూర.. సాధారణ రోటీలను కూడా అమృతంలా మార్చేస్తుంది.
టమాటాల పుల్లటి రుచి, సుగంధ ద్రవ్యాల ఘుమఘుమలు, దానికి తోడు లావుపాటి కారప్పూస ఇచ్చే కరకరలాడే అనుభూతి..ఇవన్నీ కలిసి ప్రతి ముద్దనూ ఓ పండగలా చేస్తాయి. గుజరాతీ స్టైల్ లో ఈ కూరను టమాటాలు బాగా ఉడికించి, కొద్దిగా బెల్లం వేసి తీపి, పులుపుల కలయికగా మృదువుగా చేస్తారు. అదే రాజస్థానీ స్టైల్ లో అయితే వెల్లుల్లి, ఘాటైన మసాలాలు ఎక్కువగా వాడి స్పైసీగా తయారు చేస్తారు. ఎలా చేసుకున్నా దీని రుచి మాత్రం అద్భుతమే.

కారప్పూస టమాటో కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
-ఆవాలు
-జీలకర్ర
-ఇంగువ
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-ఉప్పు
-పచ్చిమిర్చి
-అల్లం
-పండిన టమాటాలు
-లావు కారప్పూస
-కాస్త బెల్లం లేదా పంచదార
కారప్పూస టమాటో కర్రీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి దోరగా వేయించాలి.
-ఇప్పుడు కడాయిలో సన్నగా తరిగిన టమాటో ముక్కలను వేసి, అవి మెత్తబడి నూనె పైకి తేలేంతవరకు బాగా మగ్గనివ్వాలి.
-టమాటోలు గుజ్జులా మారిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. కతియావాడి అసలైన రుచి కావాలనుకుంటే ఈ దశలోనే కొద్దిగా బెల్లం కలుపుకోండి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి ఓ 5 నుంచి 7 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వాలి.
-అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే లావు కారప్పూస వేసి సున్నితంగా కలపాలి. గ్రేవీలో ముందే వేసి ఉడికిస్తే అది మెత్తబడిపోయి కూర రుచి పాడవుతుంది. అందుకే భోజనానికి కూర్చునే సరిగ్గా రెండు నిమిషాల ముందు మాత్రమే సేవ్ కలపాలి. గ్రేవీ మరీ చిక్కగా ఉంటే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు, పల్చగా ఉంటే ఇంకొద్దిసేపు మరిగించాలి.
-వేడివేడిగా తయారైన కతియావాడి కారప్పూస టమాటో కర్రీపై కొద్దిగా కొత్తిమీర చల్లి వడ్డించండి. చపాతీ, పరాఠా, లేదా మన తెలుగువారికి ఇష్టమైన జొన్న, సజ్జ రొట్టెలతో దీని కాంబినేషన్ అదుర్స్ అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
