Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
తక్కువ ఖర్చు,ఎక్కువ పోషకాలు..పిల్లలు కూడా మెచ్చే పింక్ ఊతప్పం..ఎలా చేసుకోవాలంటే..
పిల్లలకు కూరగాయలు తినిపించడం అంటే నేటి తల్లులకు ఒక పెద్ద సవాలు. అందులోనూ బీట్ రూట్ లాంటివి వండి పెడితే.. ప్లేట్ పక్కకు నెట్టేయడం ఖాయం. ఎంతో ఆశగా లంచ్ బాక్స్‌లో పెట్టి పంపినా, సాయంత్రానికి అది అలాగే ఇంటికి తిరిగి వస్తుంటుంది. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్.. ఈ బీట్ రూట్ ఊతప్పం.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి లేదా పిల్లల లంచ్ బాక్స్ కి దీన్ని ట్రై చేసేయండి..బాక్స్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ. తక్కువ ఖర్చులో, అదిరే రుచితో, బోలెడు పోషకాలు ఉండే ఈ రంగురంగుల ఊతప్పం చూస్తే పిల్లలు వద్దనకుండా లాగించేస్తారు. రక్తం వృద్ధి చెందడానికి ఎంతో మేలు చేసే బీట్ రూట్ తో టేస్టీ ఊతప్పం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ లేదా దోశ పిండి - 2 కప్పులు
బీట్రూట్ - 2 చిన్నవి
ఉల్లిపాయ - 1
టమోటా - 1
క్యాప్సికమ్ - సగం
పచ్చిమిర్చి - 2
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - కాల్చుకోవడానికి తగినంత
కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా తొక్క తీసిన బీట్ రూట్ ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటిని మిక్సీ జార్ లో వేసి, నీళ్లు పోయకుండా (అవసరమైతే ఒక్క స్పూన్ నీళ్లు వేసి) మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఒక గిన్నెలో ఇడ్లీ లేదా దోశ పిండిని తీసుకుని అందులో రెడీ చేసుకున్న బీట్ రూట్ పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పిండి ఎంతో ఆకర్షణీయమైన గులాబీ రంగులోకి మారుతుంది. ఇది చూడగానే పిల్లలకు తినాలనే ఆసక్తి కలుగుతుంది.
-ఇప్పుడు మరో చిన్న గిన్నె తీసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమోటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.
-స్టవ్ మీద దోశ పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడయ్యాక గరిటెడు గులాబీ రంగు పిండిని తీసుకుని మందంగా (ఊతప్పంలా) పోయాలి. దోశలాగా పల్చగా అస్సలు రుద్దకూడదు.
-పిండి పచ్చిగా ఉన్నప్పుడే ముందుగా కలుపుకున్న కూరగాయల మిశ్రమాన్ని పైన చల్లాలి. గరిటెతో ఆ కూరగాయలను నెమ్మదిగా నొక్కాలి. ఇలా చేయడం వల్ల పిండి ఉడికేటప్పుడు కూరగాయలు రాలిపోకుండా అతుక్కుని ఉంటాయి.
-ఇప్పుడు ఊతప్పం చుట్టూ, పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించాలి. నెయ్యి వేస్తే వాసన, రుచి రెండూ అద్భుతంగా ఉంటాయి.
-కింది వైపు గోధుమ రంగులోకి మారి దోరగా కాలిన తర్వాత, మెల్లగా రెండో వైపునకు తిప్పుకోవాలి. కూరగాయలు మాడిపోకుండా, లైట్ గా ఫ్రై అయ్యేలా ఒక నిమిషం పాటు ఉడికించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అంతే వేడి వేడి, కలర్ ఫుల్ బీట్ రూట్ ఊతప్పం రెడీ. దీనిని కమ్మని కొబ్బరి చట్నీ లేదా కారపు పచ్చడితో సర్వ్ చేస్తే రుచి అమోఘంగా ఉంటుంది
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









