Latest Updates
-
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే.. -
మీ జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందనడానికి 10 సంకేతాలివే -
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ వెరైటీ వంటలు చేయడం కాస్త కష్టమే. అలాగని రోజూ ఒకేరకమైన వైట్ రైస్, పప్పు, కూరలు తింటే బోర్ కొట్టేస్తుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు.. అద్భుతమైన రుచినిచ్చే బెస్ట్ ఆప్షన్ ఆనియన్ రైస్ (ఉల్లిపాయ రైస్).
మిగిలిపోయిన అన్నంతో నిమిషాల్లో చేసుకోగలిగే ఈ ఆనియన్ రైస్.. పిల్లలు, పెద్దల లంచ్ బాక్స్ కు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది . ఉల్లిపాయల కమ్మదనం, పచ్చిమిర్చి ఘాటు, తాలింపు సువాసనల కలయికతో నోరూరించే ఉల్లిపాయ రైస్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి.

ఉల్లిపాయ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉడికించిన అన్నం: 2 కప్పులు
పెద్ద ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి : 2
అల్లం: చిన్న ముక్క
ఆవాలు:అర టీస్పూన్
జీలకర్ర:అర టీస్పూన్
మినప్పప్పు:అర టీస్పూన్
శనగపప్పు:అర టీస్పూన్
కరివేపాకు: 2 రెమ్మలు
పసుపు: పావు టీస్పూన్
కారం : అర టీస్పూన్
గరం మసాలా : పావు టీస్పూన్
నూనె : 2 టీస్పూన్లు
నెయ్యి : 1 టీస్పూన్
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కొద్దిగా
నిమ్మరసం : 1 టీస్పూన్
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
ఉల్లిపాయ రైస్ తయారీ విధానం
-ముందుగా ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్ లో వేసి, గింజలు ఒకదానికొకటి అతుక్కోకుండా పొడిపొడిగా ఉండేలా చల్లార్చుకోవాలి. రాత్రి మిగిలిన అన్నం ఫ్రిజ్ లో పెట్టి వాడితే ఈ రెసిపీకి మరింత బాగా సెట్ అవుతుంది.
-స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె, నెయ్యి వేసి వేడిచేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. అవి కమ్మటి వాసనతో రంగు మారుతున్నప్పుడు కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేయించాలి.
-ఇప్పుడు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను పాన్ లో వేసి మీడియం మంటపై మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మెత్తబడి, లేత బంగారు రంగులోకి మారుతున్నప్పుడు... పసుపు, కారం, తగినంత ఉప్పు, కాస్త గరం మసాలా వేసి కలపాలి. మసాలాలు మాడిపోకుండా తక్కువ మంటపై కొన్ని సెకన్ల పాటు వేయించాలి. ఈ ఉల్లిపాయల మిశ్రమమే రైస్ కు అసలైన రుచిని ఇస్తుంది.
-ఉల్లిపాయల మసాలా సిద్ధమయ్యాక, ముందుగా ఆరబెట్టుకున్న అన్నాన్ని పాన్ లో వేయాలి. అన్నం మెతుకులు విరగకుండా, మసాలా అంతా అన్నానికి పట్టేలా గరిటెతో పైకి, కిందకి నెమ్మదిగా కలుపుకోవాలి. రెండు, మూడు నిమిషాల పాటు సన్నని మంటపై వేడి చేసిన తర్వాత, నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
-కరకరలాడే రుచి కావాలనుకుంటే కాస్త వేయించిన పల్లీలు లేదా జీడిపప్పును కూడా కలుపుకోవచ్చు.
-అంతే.. ఎంతో రుచికరమైన వేడివేడి ఉల్లిపాయ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
