Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
చక్కెర లేని రాగి కేక్..బేకరీ కంటే రుచిగా..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే
ఈ మధ్య కాలంలో ఆరోగ్యం కోసం అందరూ మిల్లెట్స్ ని తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవెనింగ్ స్నాక్, డిన్నర్ ఇలా ఏదైనా మిల్లెట్స్ తో చేసిన ఆహారాలు తీసుకునే వాళ్లు పెరుగుతున్నారు. మిల్లెట్స్ లో ఒకటైన రాగుల్లో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. రాగులతో బోలెడు వెరైటీ రెసిపిలను తయారుచేసుకున్నట్లు అందులో ఒకటి రాగి కేక్. దీనిని కేవలం 15 నిమిషాల్లోనే తయారుచేసుకోవచ్చు. పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టపడతారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం పొందవచ్చు.
బర్త్ డే పార్టీల సమయంలో బేకరీ నుంచి చేసిన కేకులను తెచ్చుకునే కన్నా ఇంట్లోనే ఈజీగా హెల్తీ రాగి కేక్ ను తయారుచేసుకోడం ద్వారా డబ్బులు సేవ్ అవుతాయి, ఆరోగ్యం కూడా. సాధారణంగా బేకరీల్లో తయారుచేసే కేకుల్లో గోధుమ పిండి, చక్కెరను ఉపయోగిస్తారు. అయితే రాగి కేకులో పోషకమైన రాగి పిండిని ఉపయోగిస్తారు. చక్కెరకు బదులుగా బెల్లం పొడి లేదా ఖర్జూర పేస్ట్ జోడించడం ద్వారా దీనిని మరింత ఆరోగ్యకరమైనదిగా చేయవచ్చు. ఇది షుగర్ పేషెంట్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. రాగి కేక్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ పద్ధతి ఇక్కడ చూడండి.
రాగి కేక్ తయారీకి కావలసిన పదార్థాలు
-రాగి పిండి
-బెల్లం తురుము
-ఆలివ్ నూనె
-పాలు లేదా బాదం పాలు
-గుడ్డు లేదా శాఖాహారులయితే అరటిపండు పేస్ట్
-బేకింగ్ సోడా
-బేకింగ్ పౌడర్
-యాలకుల పొడి
-రుచికి ఉప్పు
-డ్రై ఫ్రూట్స్
రాగి కేక్ ఎలా తయారు చేయాలి
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో 1 కప్పు రాగి పిండిని వేయండి. ఇందులోనే అరకప్పు బెల్లం పొడి, పావు టీస్పూన్ బేకింగ్ సోడా, పావు టీస్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీస్పూన్ యాలకుల పొడి,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-మరొక గిన్నెలో పావు కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె, పావు కప్పు పాలు లేదా బాదం పాలు, 1 గుడ్డు వేసి నునుపైన వరకు బ్లెండ్ చేయండి. నెమ్మదిగా ఈ ద్రవ మిశ్రమాన్ని పిండి మిశ్రమానికి వేసి, మందపాటి పేస్ట్ గా ఏర్పడే వరకు కలపండి.
-తర్వాత అందులో పావు కప్పు డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి.
-ఇప్పుడు బేకింగ్ డిష్ లేదా కేకు పెట్టడానికి లోతైన గిన్నెకు కొంచెం నూనె లేదా వెన్న రాసి, తయారుచేసిన మిశ్రమాన్ని అందులో పోయాలి.
-ఓవెన్ ను వేడి చేయండి. తర్వాత కేక్ మిశ్రమాన్ని సుమారు 30 నిమిషాలు బేక్ చేయండి. కేక్ ఉడికిందో లేదో తనిఖీ చేయడానికి టూత్ పిక్ లేదా కత్తిని చొప్పించండి. అది శుభ్రంగా బయటకు వస్త, కేక్ సిద్ధంగా ఉంటుంది.
-చల్లబడిన తర్వాత దానిని మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోండి. ఇంట్లో మీ ఆరోగ్యకరమైన తీపి రాగి కేక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







