Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మెత్తని దూదుల్లాంటి రాగి ఇడ్లీ..షుగర్ పేషెంట్లకు, బరువు తగ్గేవారికి నెంబర్ 1 బ్రేక్ ఫాస్ట్!
సాధారణంగా మనం బియ్యం పిండితో ఇడ్లీలు చేసుకుంటాం. కానీ బియ్యం కంటే రాగులతో చేసిన ఇడ్లీలు ఎన్నో రెట్లు ఎక్కువ పోషకాలను అందిస్తాయి. ఇతర ఏ ధాన్యాలతో పోల్చినా రాగుల్లో కాల్షియం శాతం అత్యధికంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి చాలా అవసరం.
పెరుగుతున్న పిల్లలకు, ఎముకల బలహీనత ఉన్న వృద్ధులకు రాగి ఇడ్లీ ఒక దివ్యౌషధం. రాగి ఇడ్లీ డయాబెటిస్ వారికి బెస్ట్ ఆప్షన్. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్.

చాలామంది రాగి ఇడ్లీలు గట్టిగా వస్తాయని, రుచి బాగోవని అనుకుంటారు. కానీ సరైన కొలతలతో, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే మెత్తని దూదుల్లాంటి రాగి ఇడ్లీలను సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
-రాగి రవ్వ
-ఇడ్లీ రవ్వ
-మెంతులు
-మినపప్పు
తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు వేసి నీళ్లు పోసి 2-3 శుభ్రంగా కడుక్కోవాలి.
-కడిగిన తర్వాత మినపప్పు మునిగేంతవరకు నీరు పోసి,ఇందులోనే 1 టీస్పూన్ మెంతులు కూడా వేసి కనీసం 5 గంటల పాటు నానబెట్టాలి.
-మరొక బౌల్ లో 2 కప్పుల రాగి రవ్వ, 1కప్పు ఇడ్లీ రవ్వ వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి కనీసం 5 గంటల పాటు నానబెట్టాలి.
-5 గంటల తర్వాత నానిన మినపప్పుని శుభ్రంగా కడిగి నీరు వంపేసి పప్పుని మిక్సీ గిన్నెలో వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-తర్వాత నానిన రవ్వ మిశ్రమాన్ని నీటిని పిండేసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసి చేత్తో బాగా కలుపుకొని మూత పెట్టి రాత్రంతా పక్కన పెట్టేయాలి.
-తర్వాత మూత తీసి చూస్తే పిండి పొంగి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోండి.
-ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో పిండి మిశ్రమాన్ని వేసి ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టి జస్ట్ 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. అంతే రాగి ఇడ్లీ రెడీ.
-వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరితో చేసిన చట్నీ రాగి ఇడ్లీకి బెస్ట్ కాంబినేషన్. అల్లం చట్నీ లేదా కారప్పొడితో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. కూరగాయలు వేసి చేసిన వేడి సాంబార్లో రాగి ఇడ్లీని ముంచుకుని తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications