Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Ragi Murukulu: సాంప్రదాయకమైన రాగి మురుకులు.. ఈజీగా ఇలా చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది!
రాగులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగి పిండితో చేసే అన్ని రకాల వంటలు చాలా రుచిగా ఉండడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ రాగి పిండితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. అందులో ఒకటి రాగి మురుకులు. కరకరలాడుతూ కాస్త కారంగా, కొంచెం రాగి రుచితో ఉండే ఈ మురుకులు అందరికీ నచ్చేస్తాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అతి తక్కువ సమయంలో ఎంతో సులభంగా ఈ రాగి మురుకులు చేసుకొని ఆస్వాదించేయొచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి మురుకులు తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల రాగి పిండి
- ఒక కప్పు బియ్యం పిండి
- మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న అరకప్పు పుట్నాలు
- ఓక టీస్పూన్ కారం
- ఒక టీస్పూన్ వాము
- పావు కప్పు నువ్వులు
- చిటికెడు ఇంగువ
- రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి
- రుచికి సరిపడా ఉప్పు
- మురుకులు కాల్చుకోవడానికి సరిపడా నూనె
- పిండి కలుపుకోవడానికి సరిపడా నీళ్లు
రాగి మురుకులు తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో రెండు కప్పుల రాగి పిండి పోసుకొని.. పచ్చి వాసన పోయే వరకు ఆ పిండిని వేపుకోవాలి. ఆ తరువాత ఆ కడాయిలో నుంచి పిండి తీసేసి చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి. రాగి పిండి చల్లారిన తరువాత ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి పోసుకోవాలి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుట్నాలను కూడా వేసుకోవాలి.
ఆ తరువాత బియ్యం పిండి, వాము, కారం, నువ్వులు, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత వాటన్నిటినీ బాగా కలుపుకోవాలి. అలాగే వేడి చేసిన నెయ్యిని వేసుకొని చేతి వేళ్ళతో బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడానికి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి సాఫ్ట్‌గా అయ్యే వరకు కలుపుకోవాలి.
ఆ తరువాత ఆ పిండిని మురుకులు చేసుకునే గొట్టంలో వేసుకోవాలి. మీకు ఇష్టమొచ్చిన బిళ్ళను వినియోగించి మురుకులు ఒత్తుకోవచ్చు. ఒత్తుకున్న మురుకులు మీడియం మంట మీద వేయించుకోవాలి. రెండు వైపులా మురుకులు బాగా వేయించుకోవాలి. మురుకులు బాగా ఫ్రై అయిపోయిన తరువాత, నురగలు తగ్గిపోయాక ఆ మురుకులను బయటికి తీసుకోవచ్చు. ఇలా పిండి మొత్తంతో మురుకులు వేసుకోవాలి. ఆ తరువాత ఆ మురుకులు ఎంచక్కా తింటూ ఎంజాయ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
