Latest Updates
-
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే..
రాగి పూరీ-ఉల్లిపాయ మసాలా..లెక్కలేకుండా తినేయడం గ్యారెంటీ!
మనం ఎప్పుడూ ఒకే రకమైన గోధుమ పిండి లేదా మైదాతోనే పూరీలు చేస్తుంటాం. దానికి బదులుగా ఈసారి కాస్త భిన్నంగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో పూరీలు తయారు చేసి చూడండి. ఈ రాగి పూరీ అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది.
ముఖ్యంగా మండుతున్న వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి రోజువారీ ఆహారంలో రాగిని చేర్చుకోవడం చాలా మంచిది. ఇక ఈ వేడి వేడి రాగి పూరీకి కమ్మటి ఉల్లిపాయ మసాలా (బాంబే చట్నీ) తోడైతే ఆ రుచే వేరు. రాగి పూరీ, ఉల్లిపాయ మసాలాను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాగి పూరీ, ఉల్లిపాయ మసాలా తయారీకి కావాల్సినవి
రాగి పిండి - 1 కప్పు
గోధుమ పిండి - 1 కప్పు
ఉప్పు -తగినంత
నీరు - పిండి కలపడానికి
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
ఉల్లిపాయ మసాలాకి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపపప్పు - 1 టీస్పూన్
వేరుశెనగ గుళ్లు - 2 టీస్పూన్లు
సోంపు - ముప్పావు టీస్పూన్
ఉల్లిపాయలు - 3
కరివేపాకు - 1 రెమ్మ
పచ్చిమిర్చి - 4
టమాటో - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
శనగపిండి - 2 టీస్పూన్లు
నీరు - 2 కప్పులు
కొత్తిమీర - కొద్దిగా
రాగి పూరీ, ఉల్లిపాయ మసాలా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని సాధారణ చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.
-కలుపుకున్న పిండి ఆరిపోకుండా దానిపై ఒక టీస్పూన్ నూనె రాసి, మూతపెట్టి సుమారు 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-పిండి నానేలోపు ఉల్లిపాయ మసాలా కర్రీని రెడీ చేసుకోండి. ఇందుకోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.
-నూనె వేడెక్కాక ఆవాలు, మినపపప్పు, వేరుశెనగ గుళ్లు వేసి దోరగా, బంగారు వర్ణంలోకి వచ్చేలా వేయించాక అందులో సోంపు (లేదా జీలకర్ర), కరివేపాకు వేసి చిటపటలాడాక..పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు మొత్తబడ్డాక అందులో తరిగిన టమాటో ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి టమాటాలు గుజ్జులా అయ్యేదాకా మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించి, గరం మసాలా కూడా వేసి బాగా కలిపి 2 కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి ఒక 5 నుండి 8 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి.
-అది ఉడికేలోపు ఒక చిన్న గిన్నెలో 2 టీస్పూన్ల శనగపిండి తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న కూరలో పోసి మరో 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి.
-మసాలా కాస్త చిక్కబడి, కమ్మటి వాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ మసాలా రెడీ.
రాగి పూరీలు వేయించే విధానం
-ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండిని మరోసారి బాగా పిసికి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
-చపాతీ కర్రతో వాటిని మరీ పల్చగా కాకుండా, కొద్దిగా మందంగా పూరీల్లా ఒత్తుకోవాలి.
-స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కాక, ఒత్తి పెట్టుకున్న పూరీలను అందులో వేయాలి. గరిటతో పైన కొద్దిగా ఒత్తితే పూరీలు బంతిలా పొంగుతాయి. రెండు వైపులా చక్కగా కాల్చుకుని బయటకు రాగి పూరీ రెడీ. దీనిని వేడి వేడిగా ఉల్లిపాయ మసాలాతో అద్దుకుని తింటుంటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






