Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే!
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో గ్యాస్ కొరత ఏర్పడింది. మనదేశంలో గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా చాలా హోటల్స్ మూత పడ్డాయి. ఇలాంటి సమయంలో స్టవ్ వెలిగించే పనే లేకుండా, గ్యాస్ తో ఏమాత్రం పనిలేకుండా కమ్మటి వంటకాలు క్షణాల్లో తయారు చేసుకుంటే బాగుంటుంది.
పొయ్యి వెలిగించకుండానే, ఎలాంటి ఓవెన్ అవసరం లేకుండానే తయారు చేసుకోగలిగే రెసిపీల్లో రోటి పెరుగు పచ్చడి ఒకటి. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే.. ఆ రుచి జన్మలో మర్చిపోలేరు. వేసవిలో ఒంటికి చలువ చేయడంతో పాటు, నోటికి ఎంతో రుచిగా అనిపించే ఈ కమ్మని పెరుగు పచ్చడిని ఈజీగా ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - 10
పచ్చిమిర్చి - 2
సాంబార్ ఉల్లిపాయలు- 8
కొత్తిమీర తరుగు - ఒక గుప్పెడు
చిక్కటి గడ్డ పెరుగు - పావు కప్పు
కారం - 1 టీస్పూన్
పసుపు పొడి - పావు టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత
తాలింపుకి నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు, జీలకర్ర - అర టీస్పూన్ చొప్పున
కరివేపాకు - 1 రెమ్మ
పెరుగు పచ్చడి తయారీ విధానం
-ముందుగా ఈ పచ్చడికి అసలైన పల్లెటూరి రుచి రావాలంటే రోలు లేదా దంచుకునే చిన్న గుండ్రాయి తీసుకోవాలి. అందులో 10 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో వేయడం కంటే ఇలా దంచడం వల్ల పచ్చడికి రెట్టింపు రుచి వస్తుంది.
-ఆ తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న 8 సాంబార్ ఉల్లిపాయలను అందులో వేసి బాగా దంచుకోవాలి. ఉల్లిపాయలు మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కాస్త ముక్కలు తగిలేలా చూసుకోవాలి.
-ఇప్పుడు దంచుకున్న ఆ మిశ్రమంలో కొద్దిగా కొత్తిమీర వేసి పచ్చడిలో బాగా కలిసేలా మరోసారి నెమ్మదిగా దంచుకోవాలి.
-సిద్ధం చేసుకున్న ఘాటైన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పావు కప్పు చిక్కటి పెరుగు వేయాలి.
-ఇప్పుడు ఆ పెరుగులో 1 టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన దంచిన పెరుగు పచ్చడి రెడీ.
-దీన్ని నేరుగా వేడి అన్నంలో కలుపుకుని తినేయవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో గ్యాస్ ఉండి, పచ్చడికి మరింత కమ్మదనాన్ని జోడించాలనుకుంటే చిన్న తాలింపు వేసుకోవచ్చు. స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడాక.. ఆ గుమగుమలాడే పోపును పెరుగు చట్నీలో కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications