రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్‌.!

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య రక్తహీనత, ఎముకల బలహీనత. దీంతో చిన్న వయసులోనే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ముందుగా బలమైన ఫుడ్‌ తీసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతుంటారు. అలాంటి వారికి మన పూర్వీకుల నుంచి కొనసాగుతున్న గొప్ప ఆరోగ్య ప్రదాయిని రాగులు. రాగులతో రకరకాల వంటకాలు చేస్తుంటారు. అలాంటి వాటిలో పాతకాలం నాటి అద్భుత వంటకం రాగి తోప.

Ragi thopa for strong bones and anemia problem know the traditional process

రాగులతో జావ, రొట్టెలు, దోశలు, లడ్డూలు ఇలా చాలా రకాల హెల్తీ వంటకాలు చేసుకుంటారు. ఎముకల దృఢత్వానికి, రక్తం పట్టడానికే కాదు.. డీహైడ్రేషన్‌ బారి నుంచి సైతం మనల్ని కాపాడుతుంది. ఈ క్రమంలో రాగులతో ఇలా హెల్తీగా రాగి తోప ట్రై చేయండి. రక్తహీనత సమస్యకి చెక్‌ పెట్టడమే కాకుండా ఎముకలు పటిష్టంగా ఉండేలా దోహదపడుతుంది. ఈ రాగి తోప రాగి జావ కంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు.

రాగి తోప తయారీకి కావాల్సిన పదార్థాలు

రాగి పిండి- కప్పు
బెల్లం- కప్పు
నీళ్లు- రెండు కప్పులు
నెయ్యి- మూడు టేబుల్‌ స్పూన్లు
తురిమిన పచ్చి కొబ్బరి- అర కప్పు
ఏలకుల పొడి- అర టీస్పూన్‌

రాగి తోప తయారీ విధానం

రాగి తోప తయారీ కోసం ముందుగా స్టవ్‌పైన బాణలి పెట్టుకుని అందులో బెల్లం వేసి రెండు కప్పుల నీళ్లు పోసి కరిగించుకోవాలి.

రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా..

ఇప్పుడు ఆ బెల్లం పానకాన్ని మొత్తం వడగట్టుకోవాలి. ఆ పానకాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి.

అదే బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి కరిగిన తర్వాత రాగి పిండి వేసి దోరగా వేయిస్తూ కలుపుకోవాలి.

రాగి పిండి మొత్తం మంచి వాసన వస్తూ వేగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము మరి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా బెల్లం పానకాన్ని పోసుకుంటూ ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.

Ragi thopa for strong bones and anemia problem know the traditional process

ఇప్పుడు బెల్లం పానకం మొత్తం కలిసి ఉండలు లేకుండా రాగి పిండి చిక్కగా అవుతున్నప్పుడు అర టేబుల్ స్పూన్‌ నెయ్యి వేసి కలపాలి. అడుగంటకుండా ఉండలు కట్టకుండా చిన్న మంటపైన గరిటెతో కలుపుతూనే ఉండాలి.

రాఖీ 2026 స్పెషల్: స్వీట్‌ షాప్‌ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్‌ బర్ఫీ.!

చివరిగా మిగిలిన నెయ్యి వేసి కలపాలి. రాగి పిండి చిక్కబడి నెయ్యి పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని ప్లేట్‌లో ఇంచు మందంలో ఈ మిశ్రమాన్ని పరుచుకోవాలి.

చల్లారిన తర్వాత సర్వ్‌ చేసుకోవడమే. ఆరోగ్యకరమైన రాగి తోప రెడీ. చిన్న పిల్లలు, వృద్ధులు ఎంతో ఇష్టంగా ఈ బలమైన ఫుడ్‌ను తీసుకుంటారు.

[ of 5 - Users]
Story first published: Friday, August 28, 2026, 7:30 [IST]
Desktop Bottom Promotion