Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రాజస్థానీ స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి..రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు..ఇలా చేస్తే అన్నం, రోటీల్లోకి అదుర్స్!
భారతదేశం విభిన్న సంస్కృతులకు, వంటకాలకు పుట్టినిల్లు. అందులో రాజస్థాన్ రాష్ట్రం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది విశాలమైన ఎడారులు, చారిత్రక కోటలు, వారి ఘాటైన, నోరూరించే వంటకాలు. ఎడారి ప్రాంతం కావడం వల్ల అక్కడ కూరగాయల లభ్యత తక్కువగా ఉంటుంది. అందుకే వారు తమ వంటకాల్లో పప్పులు, సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా పచ్చిమిర్చి, ఎండుమిర్చిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
రాజస్థానీ వంటకాల్లో పచ్చిమిర్చి పచ్చడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం అన్నంలోకే కాకుండా రోటీ, చపాతీ, పరాఠా, రాజస్థానీ స్పెషల్ దాల్ బాటిలోకి అద్భుతమైన కాంబినేషన్. ఈ పచ్చడి భోజనం రుచిని రెట్టింపు చేయడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రాజస్థానీ స్టైల్ పచ్చిమిర్చి పచ్చడిని మీ ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-పచ్చిమిర్చి
-వెల్లుల్లి రెబ్బలు
-శెనగపిండి
-పెరుగు
-అల్లం
-నూనె
-జీలకర్ర
-ఆవాలు
-జీలకర్ర
-ఇంగువ
-పసుపు
-ధనియాలు
-ఉప్పు
-కరివేపాకు
-కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా మీడియం కారం గల 75 గ్రాముల పచ్చిమిరపకాయలను, ఒక చిన్న అల్లం ముక్కను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత అందులోనే 15-20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని కూడా కచ్చాపచ్చాగ దంచుకోండి. మీ దగ్గర రోలు లేకుంటే మిక్సీలోనే చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యండి.
-వేడెక్కిన ఆయిల్ లో ఒక ఎండుమిర్చి ముక్క, ఒక టీస్పూన్ ధనియాలు నలిపి వేయండి, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు వేసి వేయించాలి. జీలకర్ర చిట్లిన తర్వాత ఇందులోనే చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.
-ఇప్పుడు వేగిన తాలిపుంలో కచ్చాపచ్చాగ దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసి వేపండి. ఇలా వేపడం వల్ల మిర్చిలోని ఘాటు మరింతగా తగ్గుతుంది. పచ్చిమిర్చి బాగా వేగి నూనె పైకి తేలాలి.
-నూనె పైకి తేలుతున్నప్పుడు అందులో పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి వేసి నిదానంగా వేయించి స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అర లీటరు పెరుగుని తరకలు లేకుండా బాగా చిలికి అందులో చల్లారిపోయిన మిర్చి మిశ్రమం వేసి బాగా కలిసేలా చిలుక్కోవాలి. చివరగా అందులో కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి. అంతే రాజస్థానీ పచ్చిమిర్చి పచ్చడి రెడీ.
-ఈ పచ్చడిని అన్పంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. దీనిని రోటీ, చపాతీల్లోకి తిన్నా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications