Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.!
సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అవి అరటిపండ్లు మాత్రమే. ఇక అరటికాయలతో కూరలు, చిప్స్, ఫ్రై ఇలా పలు రకాలతో రుచులను ఆస్వాదిస్తాం. కానీ అరటికాయతో కూర చేసేటప్పుడే కొన్ని చిట్కాలు తెలియక కర్రీ సరిగా కుదరదు. కానీ ఈసారి చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి. వేడి అన్నం, చపాతీలోకి లొట్టలేసుకుంటూ తినేస్తారు..

అరటికాయ ముద్ద కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
అరటి కాయలు- రెండు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
శనగపప్పు- అర టీస్పూన్
మినప్పప్పు- అర టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
ఆవాలు- అర టీస్పూన్
పచ్చిమిర్చి- నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
కరివేపాకు- రెండు రెబ్బలు
ఉల్లిపాయ- మీడియం సైజు(ఒకటి)
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
టమాటాలు- రెండు(మీడియం సైజు)
|కారం- రెండు టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి- ఒక టీస్పూన్
కొత్తిమీర- కొద్దిగా
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.!
అరటికాయ ముద్ద కూర తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో సగానికి నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు అరటికాయలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ నీళ్లలో వేసి కలపాలి. దీంతో వాటికి ఉన్న జిగురు పోతుంది. నీళ్లు తీసేసి అరటికాయ ముక్కలను కాసేపు ఆరనివ్వాలి.

ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగనివ్వాలి. ఇందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఆ లోపు టమాటా ముక్కలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.!
అరటికాయ ముక్కలు వేగి సాఫ్ట్‌గా అయిన తర్వాత టమాటా ప్యూరీని వేసి బాగా ఉడకనివ్వాలి.
తర్వాత కారం, ధనియాల పొడి వేసి మధ్యమధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. నీళ్లు పోయనందు వల్ల త్వరగా అడుగంటే అవకాశం ఉంది. అందుకే మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
కూర దగ్గరకి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే హెల్తీ అరటికాయ ముద్ద కూర రెడీ. మెరుగైన జీర్ణక్రియకు, బరువు తగ్గేందుకు, డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు అరటికాయ ఎంతగానో దోహదపడుతుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
