Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రాయలసీమ స్పెషల్ జోం పచ్చడి..నాకు నాకు అని కొట్టుకుంటారు,ఎలా చేయాలంటే
అన్నం,రాగిముద్ద, జొన్న రొట్టెలు, చపాతీలు ఎందులోకి అయినా అద్భుతంగా ఉంటుంది జోం పచ్చడి. దీనిని నెల్లూరు,రాయలసీయ ప్రాంతంలో ఎక్కువగా చేస్తుంటారు. నోట్లో పెట్టుకోగానే జివ్వుమనే రుచితో సూపర్ ఉంటుంది. ఇంట్లో దీనిని తయారుచేసేటప్పుడు నాకు నాకు అని కొట్టుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. దీనిని తయారుచేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. చాలా చాలా సింపుల్ గా దీనిని ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి ఆయిల్ కూడా పెద్దగా అక్కర్లేదు. రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే రాయలసీమ స్పెషల్ జోం పచ్చడిని ఇంట్లో తయారుచేసుకోవడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
జోం పచ్చడి తయారీకి కావలసిన
పదార్థాలు
బెండకాయ
పచ్చిమిర్చి
కొత్తిమీర
చింతపండు
వెల్లుల్లి
ఆయిల్
టమాలో
ఉల్లిపాయ
ఉప్పు

జోం పచ్చడి తయారీ విధానం
-ముందుగా 10-15 లేత బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-తర్వాత 10 లావాటి పచ్చిమిర్చిలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు కారంగా ఉండే 5 సాధారణ పచ్చిమిర్చిలను కట్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో బెండకాయ ముక్కలు వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఈ సమయంలో మంటను మీడియంలో ఉంచండి.
-బెండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత వాటిని ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో ముప్పావు కప్పు నీళ్లు పోసి కట్ చేసి ఉంచిన లావు,సన్న పచ్చిమిర్చి ముక్కలను, సన్నగా కట్ చేసిన 3 మీడియం సైజ్ టమాటో ముక్కలు వేసి మూతపెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి.
-నీళ్లు మొత్తం ఆవిరయ్యి ముక్కలన్నీ ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజు అంత చింతపండుని అందులో వేసి కొద్దిసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఇప్పుడు రోట్లో పొట్టు తీసిన 8 వెల్లుల్లి రెబ్బలు,రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఇందులో ఉడికించిన చింతపండు మాత్రమే వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత టమాటోలు,పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి.
-తర్వాత ముందుగా వేయించిన బెండకాయ ముక్కలు కూడా వేసి కొంచెం బరకగా ఉండేలా దంచుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు కొత్తిమీర వేసి పచ్చడిలో కలిసేలా దంచుకోవాలి. అంతే జోం పచ్చడి రెడీ. దీనిని తాళింపు కూడా వేయనక్కర్లేదు.
-ఒకవేళ మీ ఇంట్లో రోలు లేకుంటే మిక్సీలో అయినా దీనిని చేసుకోవచ్చు. మిక్సీలో చేసేటప్పుడు పల్స్ ఇస్తూ పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications