Latest Updates
-
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్పీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.!
బ్రెడ్ హల్వాలో ఇది కలిపితే రుచి రెట్టింపు..సీక్రెట్ ఇదే!
మనదేశంలో తీపి వంటకాలు లేదా మిఠాయిలకు ప్రత్యేక స్థానం ఉంది. పండుగలు, వేడుకలు లేదా సాధారణ దినాలలో కూడా తీపి తినడానికి ఇష్టపడతారు. అలాంటి రుచికరమైన, త్వరగా తయారుచేయగల వంటకాలలో బ్రెడ్ హల్వా ఒకటి. బ్రెడ్ హల్వా ప్రధానంగా తీపి వంటకం అయినప్పటికీ, ఇందులో ఉపయోగించే కొన్ని పదార్థాల వలన కొన్ని శక్తి, పోషక ప్రయోజనాలు ఉన్నాయి. బ్రెడ్ హల్వా అనేది ప్రాథమికంగా శక్తిని అందించే ఆహారం. బ్రెడ్, పంచదారలో అధికంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి ముఖ్యమైన శక్తి వనరుగా పనిచేస్తాయి. దీనిని తినడం వలన తక్షణమే శక్తి లభిస్తుంది, ముఖ్యంగా అలసటగా ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. బ్రెడ్ హల్వాను మీ ఇంట్లోనే క్షణాల్లోనే తయారుచేసుకోవడం ఎలాగో ఇక్కడ చూడండి.
బ్రెడ్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
-మిల్క్ బ్రెడ్
-జీడిపప్పు
-నెయ్యి
-ఆరెంజ్ ఫుడ్ కలర్
-చక్కెర
-పాలు
-పచ్చికోవా

బ్రెడ్ హల్వా తయారీ విధానం
-ముందుగా 4 స్లైసుల మిల్క్ బ్రెడ్ ను ఎడ్జెస్ కట్ చేసుకున్నాక బ్రెడ్ ను స్వేయర్ షేపులో ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయిలో పావు కప్పు నెయ్యి వేసి వేడి చేశాక స్క్వేయర్ షేపులో కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను నెయ్యిలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. అన్ని బ్రెడ్ ముక్కలను కొన్ని కొన్నిగా నెయ్యి మళ్లీ వేసుకుంటూ వేయించి పక్క
-తర్వాత స్టవ్ మీద బాండీలో 1 టీస్పూన్ నెయ్యి వేసి 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి.
-తర్వాత పాన్ లో 200 ఎమ్ఎల్ నీళ్లు పోసి అందులో 150గ్రాముల చక్కెర వేసి కరిగించాక లేత పాకానికి,ఓ తీగ పాకానికి మధ్యన ఉన్నప్పుడు వేయించిన బ్రెడ్ ముక్కలను అందులో వేసి ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పాలు పోసి 2-3 నిమిషాలు సిమ్ లో ఉడికించాలి.
-తర్వాత అందులో అరచెంచా ఆరెంజ్ రెడ్ కలర్ వేసి ఓసారి కలుపుకొన్నాక 50 గ్రాముల పచ్చికోవా వేసి బాగా కలుపుకోని సిమ్ లో 3-4 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవాలి. అంతే టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ. పూరీతో దీన్ని నంజుకొని తిన్నా కేక ఉంటుంది.
-ఇది తీపి వంటకం కాబట్టి ముఖ్యంగా మధుమేహం లేదా షుగర్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది కొద్దిగా కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం కాబట్టి పండుగల సమయంలో లేదా అప్పుడప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి, ఆనందానికి మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications