Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కొత్తగా రిచ్ అండ్ టేస్టీ చికెన్ వైట్ కుర్మా..వేడి ఇడ్లీతో తింటే అదరహో
వీకెండ్ వప్తే మన ఇళ్లలో అల్పాహారం కోసం ఇడ్లీ, దానికి తోడుగా ఘాటైన చికెన్ పులుసు లేదా గ్రేవీ ఉండాల్సిందే. ఎప్పుడూ తినే ఎర్రటి కారం గ్రేవీ రుచి మీకు బోర్ కొట్టిందా? అయితే ఈసారి చికెన్ వైట్ కుర్మా ట్రై చేయాల్సిందే.
సాధారణంగా హోటల్స్ లో పరోటా లేదా ఇడ్లీలోకి తెల్లగా, క్రీమీగా ఉండే కుర్మా ఇస్తుంటారు కదా? అదే రుచిని మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి.
కావలసిన పదార్థాలు
పచ్చి కొబ్బరి తురుము - 1 గుప్పెడు
సాంబార్ ఉల్లిపాయలు - 10
పల్లీలు- 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 10
గసగసాలు - 1 టేబుల్ స్పూన్
సోంపు - 1 టేబుల్ స్పూన్
మిరియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2
చికెన్ - ముప్పావు కిలో
కొబ్బరి నూనె - 2- 3 చెంచాలు
బిర్యానీ మసాలా(యాలకులు-4, దాల్చిన చెక్క-2 ముక్కలు, లవంగాలు-3,
బిర్యానీ ఆకు)
పెద్ద ఉల్లిపాయలు - 4
పచ్చిమిర్చి - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
టమోటా - 1
పుదీనా - 1 గుప్పెడు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి, చిన్న ఉల్లిపాయలు, వేరుశనగ పప్పు(పల్లీలు), జీడిపప్పు, గసగసాలు, సోంపు, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయాలి. ఇందులో కొద్దిగా నీరు పోసి, మరీ బరకగా కాకుండా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. ఇందులో కొబ్బరి నూనె వేయండి. నూనె వేడయ్యాక యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించండి. ఆ సువాసన రాగానే చీల్చిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.
-ఇప్పుడు కుక్కర్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసిఅవి మెత్తబడి లేత బంగారు రంగులోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
-ఇప్పుడు అందులో తరిగిన టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేయించండి.
-ఇప్పుడు అందులో శుభ్రం చేసిన చికెన్ ముక్కలను కుక్కర్ లో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి 2 నిమిషాల పాటు నూనెలో కలపండి.
-ఇప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ముక్కలకు పట్టేలా కలపాలి. ఆపై సువాసన కోసం గుప్పెడు పుదీనా ఆకులు వేయండి.
-కుర్మా చిక్కదనాన్ని బట్టి అవసరమైనన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టండి. మీడియం మంటపై 2 నుండి 3 విజిల్స్ రానివ్వండి.
-కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి చూస్తే, ఇల్లంతా ఘుమఘుమలాడే వాసన వస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి ఒకసారి కలిపితే చాలు.
-అంతే వైట్ చికెన్ కుర్మా రెడీ. కేవలం ఇడ్లీలోకే కాదు, దోశ, చపాతీ, పరోటాల్లోకి కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






