Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
కరకరలాడే పనీర్ కట్లెట్స్..రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
ప్రోటీన్ల గని అయిన పనీర్ అంటే ఇష్టపడని వారు దాదాపు ఎవరూ ఉండరు. పనీర్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి, క్యాల్షియం పుష్కలంగా అందుతాయి. సాయంత్రం కాగానే ఏదైనా వేడిగా, కరకరలాడుతూ తినాలనిపిస్తుందా?
వీధి బండ్ల దగ్గర లేదా రెస్టారెంట్లలో దొరికే పనీర్ కట్లెట్స్ రుచి చూసి, అబ్బా.. ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే ఎంత బాగుండు అని మీరెప్పుడైనా అనుకున్నారా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన స్నాక్ పనీర్ కట్లెట్ కేవలం 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

పనీర్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
తాజా పనీర్ - 100 గ్రాములు
బంగాళదుంపలు - 3-4
క్యారెట్ - 1
క్యాప్సికమ్ - 1
ఉల్లిపాయలు - 2
కొత్తిమీర - అర కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - పావు టీస్పూన్
ఒరేగానో - పావు టీస్పూన్
కార్న్‌ఫ్లోర్ - 2 టీస్పూన్లు
చాట్ మసాలా - చిటికెడు
మిరియాల పొడి - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
మైదా పిండి - 2 టీస్పూన్లు
కార్న్ ఫ్లేక్స్- 2 కప్పులు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
పనీర్ కట్లెట్ తయారీ విధానం
-ముందుగా బంగాళదుంపలను ఉడికించుకొని పక్కన పెట్టుకోండి.
- క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో పనీర్ ను చేతితో మెత్తగా చిదుముకోవాలి. అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా తురిమి పనీర్ లో కలపాలి. ఇందులోనే కచ్చాపచ్చాగా దంచిన జీలకర్ర, తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, ఉప్పు, చాట్ మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, రెండు స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-కట్లెట్స్ కరకరలాడటం కోసం ఒక మిక్సీ జార్ లో కార్న్ ఫ్లేక్స్ ను వేసి బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. మరొక చిన్న గిన్నెలో మైదా పిండి వేసి, అర గ్లాసు నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చటి మిశ్రమంలా కలుపుకోవాలి.
-ఇప్పుడు పనీర్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన ఆకారంలో చిన్న చిన్న కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఈ కట్లెట్ ను ముందుగా మైదా మిశ్రమంలో ముంచి, ఆ తర్వాత కార్న్ ఫ్లేక్స్ పొడిలో లేదా బ్రెడ్ క్రంబ్స్ లో దొర్లించాలి.
-స్టవ్ వెలిగించి, ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేశాక మంటను మీడియంలో పెట్టి కట్లెట్స్ ను రెండు వైపులా తిప్పుతూ బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
-నూనెలో డీప్ ఫ్రై వద్దు అనుకునేవాళ్లు కొద్దిగా నూనె రాసి పెనం మీద ఫ్రై చేసుకోవచ్చు. ఈ కట్లెట్స్ ను టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
