Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఈ ఆమ్లెట్ రుచి చూశారంటే మతి పోవాల్సిందే..నోట్లో వెన్నలా కరిగిపోతుంది
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఆమ్లెట్ తినడం చాలా మందికి ఇష్టం. అయితే, హోటళ్లలో దొరికేలా స్పాంజ్ లా ఉబ్బుతూ, సాఫ్ట్ గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఇంట్లో ఎలా చేయాలో అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఒక చిన్న ట్రిక్ పాటిస్తే సరిపోతుంది, మీ ఇంట్లోనే ఈ ఫ్లఫీ ఆమ్లెట్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. పప్పు, రసం, సాంబార్ లోకి కూడా సైడ్ డిష్ గా ఈ ఆమ్లెట్ అదిరిపోతుంది.

ఫ్లఫీ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-కోడిగుడ్లు
-ఉప్పు
-మిరియాల పొడి
-నూనె
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-కారం
-పసుపు
-ధనియా జీరా పొడి
ఫ్లఫీ ఆమ్లెట్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులో కరివేపాకు వేసి 1 పచ్చిమిర్చి ముక్కలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల సన్నని చీలికలు, కొంచెం ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి.
-ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అందులో అర స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఉల్లిపాయ ముక్కలకి అవన్నీ బాగా పట్టేలా కలుపుకొని ఫ్రై చేసుకోండి.
-ఈ లోగా ఒక గిన్నెలో 4 కోడిగుడ్లు పగలకొట్టి వేసుకోండి. గుడ్డులోని యొల్లో(చందమామ వచ్చే పసుపు రంగుది)ని సపరేట్ గా మరో గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు కొడిగుడ్డు వైట్(తెల్ల సొన)మిశ్రమాన్ని ఫోర్క్ తో నురగ వచ్చులా బాగా బీట్(గిలక్కొట్టడం) చేసుకోవాలి. ఈ సమయంలో అందులోనే రుచికి తగ్గట్లు ఉప్పు కూడా వేసి బీట్ చేసుకోండి.
-బీట్ చేశాక బాగా నురుగలా వచ్చిన తర్వాత అందులో అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసి కలుపుకోండి.
-ఇప్పుడు మరో గిన్నెలో పక్కన ఉంచుకున్న ఎగ్ యొల్లోస్ ని కూడా స్పూన్ తో బీట్ చేసుకొని ఉప్పు, పావు స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో వేగిన ఉల్లిపాయల్లో అర స్పూన్ ధనియా జీరా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకున్నాక పాన్ లోనే ఉల్లిపాయ ముక్కలను సమానంగా పరుచుకున్నట్లు చేయండి. దానీ మీద పక్కన ఉంచుకున్న ఎగ్ ఎల్లొ మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత నురగలా వచ్చేదాకా బీట్ చేసుకున్న ఎగ్ వైట్ మిశ్రమాన్ని కూడా సమానంగా పరుచుకున్నట్లు పాన్ లో వేసుకోండి. పైన కొంచెం కారం చల్లుకొని మూతపెట్టుకోండి. మంటను సిమ్ లోనే ఉంచి 3 నిమిషాల పాటు అలా వదిలేయండి.
-తర్వాత స్టవ్ ఆపేసి మూత తీయండి. ఆమెట్ల్ ఉడికి ఇంకొంచెం పొంగినట్లు అనిపిస్తుంది. దీనిని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం చల్లుకొని తింటుంటే అదిరిపోతుంది. పప్పు, రసం, సాంబార్ లోకి కూడా సైడ్ డిష్ గా ఈ ఆమ్లెట్ అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
