Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఇడ్లీ, దోశ, అన్నం దేనికైనా సరే ఈ ఒక్క చట్నీ చాలు.. నెల రోజులు నిల్వ ఉంటుంది
ఉదయం టిఫిన్ లోకి కాస్త భిన్నంగా, కారంగా, పుల్లగా, తియ్యగా.. ఇలా అన్ని రుచుల సమ్మేళనంతో నోరూరించే కారం చట్నీని ప్రయత్నించండి. ఇది కేవలం రుచిలోనే కాదు, నిల్వ ఉండటంలోనూ దీనికి సాటి లేదు. ఈ చట్నీ పది రోజుల నుంచి నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది.
ఈ చట్నీ ఇది వేడి వేడి ఇడ్లీ, మెత్తటి దోశలతోనే కాదు.. పూరీ, చపాతీ, ఊతప్పం వంటి వాటితో కూడా అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ చట్నీ కలుపుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది. కారం చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కారం తక్కువగా ఉండే కశ్మీరీ ఎండు మిరపకాయలు- 10
గుంటూరు మిర్చి- 10
చింతపండు - నిమ్మకాయంత
సాంబార్ ఉల్లిపాయలు- 25
వెల్లుల్లి రెబ్బలు - 20
నువ్వుల నూనె - రెండున్నర టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
బెల్లం పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
వేడి నీళ్లు - అర కప్పు
తయారీ విధానం
-ముందుగా రెండు రకాల ఎండు మిరపకాయల తొడిమలు తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులోనే చింతపండు కూడా వేసి అర కప్పు వేడి నీళ్లు పోసి పది నిమిషాల పాటు నానబెట్టండి.
-పది నిమిషాల తర్వాత నానబెట్టిన మిరపకాయలు, చింతపండును నీళ్లతో సహా మిక్సీ గిన్నెలో వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా జతచేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి వేడిచేయండి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు వేయండి. అవి చిటపటలాడుతుండగా మినపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి.
-పోపు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, సాంబార్ ఉల్లిపాయ ముక్కలు వేసి, పచ్చి వాసన పోయి బంగారు రంగులోకి మారేంత వరకు బాగా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరపకాయల పేస్టును వేయండి. మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు పోసి, దాన్ని కూడా కడాయిలో వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు మూత పెట్టి మంటను తగ్గించి 5 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత మూత తీసి కలపండి. చట్నీలోని నీరంతా ఇగిరిపోయి, నూనె పైకి తేలుతున్నప్పుడు, బెల్లం పొడి వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు మూత లేకుండా ఉడికించాలి.
-చట్నీ చిక్కబడి మంచి పరిమళం వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా మిగిలిన 1 టేబుల్ స్పూన్ పచ్చి నువ్వుల నూనెను పైన వేసి కలపండి. ఇది చట్నీకి అదనపు రుచిని, సువాసనను ఇవ్వడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది.
-అంతే ఘుమఘుమలాడే కారం చట్నీ రెడీ. దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు దీని రుచిని ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications