Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్!
వేసవికాలంలో బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా మనసు ఎప్పుడూ ఏదైనా చల్లగా, తీయగా తాగాలని ఆరాటపడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీరానికి అద్భుతమైన చల్లదనాన్ని, మనసుకు అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇచ్చే డెజర్ట్ డ్రింక్ రోజ్ ఫలూదా.
చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే లేత గులాబీ రంగు, రోజ్ సిరప్ అద్భుతమైన సువాసన, చల్లటి పాలు, ఫలూదా సేవ్, సబ్జా గింజల కలయిక.. దీనికి తోడు కమ్మని వెనిల్లా ఐస్ క్రీం.. ఇవన్నీ కలిస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వర్గంలా అనిపిస్తుంది. బయట కేఫ్ లు, రెస్టారెంట్లలో దొరికే ఈ ఖరీదైన డెజర్ట్ ను అతి తక్కువ సమయంలో, ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

రోజ్ ఫలూదా తయారీకి కావలసిన పదార్థాలు
కాచి చల్లార్చిన చల్లటి పాలు - 2 కప్పులు
రోజ్ సిరప్- 3 టేబుల్ స్పూన్లు
ఫలూదా సేవ్ - అర కప్పు
సబ్జా గింజలు- 1 టేబుల్ స్పూన్
వెనిల్లా ఐస్ క్రీం - 2 స్కూప్స్
చక్కెర - రుచికి తగినట్లుగా
డ్రై ఫ్రూట్స్: సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా
రోజ్ ఫలూదా తయారీ విధానం
-ముందుగా ఒక చిన్న గిన్నెలో సబ్జా గింజలను తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇవి నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి.
-ఒక గిన్నెలో నీటిని మరిగించి, అందులో ఫలూడా సేవ్ ను వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఆ వేడి నీటిని వడకట్టి సేవ్ ను చల్లటి నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి ఒకదానికొకటి అంటుకోకుండా, పొడిపొడిగా ఉంటాయి.
-ఇప్పుడు ఒక పొడవైన గాజు గ్లాసును తీసుకోండి. గ్లాసు లోపలి అంచుల చుట్టూ ఒకటి లేదా రెండు చెంచాల రోజ్ సిరప్ ను అందంగా డిజైన్ లాగా పోయండి. గ్లాసు అడుగు భాగంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఫలూడా సేవ్ ఒక లేయర్ వేయండి. ఆ తర్వాత బాగా నానిన సబ్జా గింజలను వేయండి.
-ఇప్పుడు ఫ్రిజ్ లో ఉంచిన చల్లటి పాలను గ్లాసు ముప్పావు వంతు నిండేలా పోసి, ఒక స్పూన్ తో కిందనుండి పైకి నెమ్మదిగా కలపండి. పాలు లేత గులాబీ రంగులోకి మారి చూడముచ్చటగా కనిపిస్తాయి.
-దీని పైన ముగింపుగా ఒక పెద్ద వెనిల్లా ఐస్ క్రీం స్కూప్ ను ఉంచండి.
-చివరగా కొద్దిగా రోజ్ సిరప్‌ను ఐస్ క్రీం పైన జల్లి, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ తో అందంగా అలంకరించండి.
-అంతే నోరూరించే రోజ్ ఫలూదా రెడీ. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు పండ్ల రసాలకు బదులుగా ఇలా ఫలూదా చేసి ఇస్తే వారు కచ్చితంగా ఫిదా అయిపోతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications