ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్‌, రసం పొడులు.. హోటల్‌ స్టైల్‌ రుచితో ఇంట్లోనే.!

లంచ్‌, డిన్నర్‌లో చివర్లో రసం లేదా సాంబార్‌ లేనిదే భోజనం పూర్తి కాదు. ఎన్ని కూరలతో తిన్నా వీటితో ఫినిషింగ్‌ టచ్‌ లేనిదే సంతృప్తిగా ఉండదు. జీర్ణక్రియపైనా ప్రభావం చూపిస్తుంది. అయితే సాంబార్‌, రసంలో మరిగేటప్పుడు చివర్లో వేసే పౌడర్‌తోనే దాని రుచి అదిరిపోతుంది. ఈ పౌడర్లు బయట కూడా అందుబాటులో ఉంటాయి. అయితే వీటిని మార్కెట్లో కొనే కంటే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యకరంగా, రుచిగా ఉంటాయి. ఈ పొడులను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

Sambar and Rasam powders that stay fresh for four months if prepared once

సాంబార్‌ పౌడర్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

ఎండు మిర్చి- 330 గ్రాములు
ధనియాలు- 550 గ్రాములు
కరివేపాకు- గుప్పెడు
కందిపప్పు- 70 గ్రాములు
మిరియాలు- 20 గ్రాములు
బియ్యం- 35 గ్రాములు
జీలకర్ర- 35 గ్రాములు
పచ్చి శనగపప్పు- 70 గ్రాములు
ఇంగువ- 35 గ్రాములు
పసుపు- 35 గ్రాములు
మెంతులు- 20 గ్రాములు

రసం పౌడర్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

ఎండుమిర్చి- 210 గ్రాములు
ధనియాలు- 310 గ్రాములు
జీలకర్ర- 155 గ్రాములు
మిరియాలు- 110 గ్రాములు
కందిపప్పు- 100 గ్రాములు
ఉప్పు- 80 గ్రాములు
పసుపు- 20 గ్రాములు
మెంతులు- 20 గ్రాములు
ఇంగువ- 5 గ్రాములు

సాంబార్‌, రసం పౌడర్ల తయారీ విధానం

వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్‌ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ ఇదే.!

సాంబార్‌ పౌడర్‌ తయారీ కోసం ముందుగా స్టవ్‌పైన వెడల్పాటి బాణలి పెట్టుకుని వేడయ్యాక సన్నటి మంటపైన ధనియాలు దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి.

తర్వాత వీటిని ఒక్కొక్కటిగా చిన్న మంటపైన వేయించుకోవాలి. అన్నీ దోరగా వేయించుకున్న తర్వాత ప్లేట్‌లో వేసుకుని చల్లారనివ్వాలి. చివర్లో ఎండు మిర్చిని కూడా వేయించుకోవాలి.

Sambar and Rasam powders that stay fresh for four months if prepared once

ఇదే మాదిరిగా రసం పౌడర్‌ కోసం సిద్ధం చేసిన వాటిని పై మాదిరిగానే ఒక్కొక్కటి వేయించి పెట్టుకోవాలి. మొదటగా సాంబార్‌ పౌడర్‌ కోసం వేయించిన వాటిని గ్రైండర్‌ సాయంతో పొడిగా చేసుకోవాలి.

ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా..

తర్వాత రసం పౌడర్‌ కోసం వేయించిన వాటిని అదే విధంగా పొడి మాదిరిగా చేసుకుని రెండింటీనీ గాజు డబ్బాల్లో విడివిడిగా స్టోర్‌ చేసుకుని గట్టిగా మూత పెట్టుకుని గాలి చొరబడకుండా ఉంచాలి.

ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత సాంబార్‌ పౌడర్‌ కేజీపైన వస్తుంది. రసం పౌడర్‌ కేజీ లోపల వస్తుంది. ఈ పద్ధతిలో చేసుకుంటే ఈ రెండు పౌడర్ల నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. సాంబార్‌, రసం, పప్పు చారు చేసుకునేటప్పుడు దానికి తగినట్లుగా ఈ పొడులు వేసుకుని ట్రై చేయిండి. హోటల్‌ స్టైల్‌ను మించిన టేస్ట్‌తో అద్భుతంగా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Saturday, September 12, 2026, 15:10 [IST]
Desktop Bottom Promotion