పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు!

ఆంజనేయ స్వామి అనగానే ఫస్ట్ మనకు ఆయన శక్తి సామర్థ్యాలే గుర్తుకొస్తాయి. హనుమంతుడంటేనే ధైర్యం, బలం, నమ్మకం..అందుకే ఆయనను హిందువులే కాకుండా ఇతర మతాల వ్యక్తులు కూడా పూజిస్తుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా తన జేబులో ఎప్పుడూ హనుమంతుడి చిన్న ప్రతిమను పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామి తన వెంట ఉంటే తనకు ధైర్యంగా ఉంటదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే ఆంజనేయ స్వామి శక్తి సామర్థ్యాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కానీ తాజాగా మధ్యప్రదేశ్ లో ఆంజనేయ స్వామి మరోసారి తన మహిమను బయటపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Machines Fail Faith Wins The Ujjain Hanuman Idol That Heavy Cranes Couldn t Move

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ నగరం ఎప్పుడూ ఏదో ఒక ఆధ్యాత్మికతతో ఉట్టిపడుతుంటుంది. కానీ, తాజాగా అక్కడ జరిగిన ఓ వింత ఘటన ఆధునిక విజ్ఞాన శాస్త్రానికే సవాల్ విసురుతూ... ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేవుడున్నాడా? లేదా? అనే తర్కాలను పక్కనపెడితే, అక్కడ చోటుచేసుకున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే

అసలు ఏం జరిగిందంటే..

2028వ సంవత్సరంలో ఉజ్జయినిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింహస్థ కుంభమేళా జరగనుంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఈ మహా ఘట్టం కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలో రోడ్ల విస్తరణ పనులను ముమ్మరంగా చేపట్టారు.

అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి?అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి?

అయితే ఈ విస్తరణ మార్గంలో సుమారు 170 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన ఖడే హనుమాన్(నిల్చున్న ఆంజనేయ స్వామి) ఆలయం అడ్డుగా వచ్చింది. రోడ్డును వెడల్పు చేయాలంటే ఆ గుడిని తొలగించి, అందులో ఉన్న 8 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని మరో సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు.

అంతా అనుకున్నట్లుగానే అధికారుల బృందం విగ్రహ తరలింపునకు రంగంలోకి దిగింది. అత్యాధునిక జేసీబీలు, భారీ బరువులు అవలీలగా ఎత్తే క్రేన్లు, శక్తివంతమైన హైడ్రాలిక్ యంత్రాలను అక్కడికి రప్పించారు. పనులు మొదలయ్యాయి. కానీ గంటలు గడుస్తున్నాయి.. రోజులు మారుతున్నాయి.. అయినా ఆ 8 అడుగుల విగ్రహం కనీసం ఒక్క అంగుళం కూడా కదల్లేదు.

Machines Fail Faith Wins The Ujjain Hanuman Idol That Heavy Cranes Couldn t Move

ఏకంగా నాలుగు రోజుల పాటు, రాత్రింబవళ్లు సుమారు 40 గంటలకు పైగా ఇంజనీర్లు, కార్మికులు తమ శక్తినంతా ధారపోశారు. పెద్ద పెద్ద యంత్రాలు సైతం స్వామి మహిమ ముందు చిన్నబోయాయి. యంత్రాల ఇంజిన్లు మొరాయించాయే తప్ప, విగ్రహం మాత్రం ఇసుమంత కూడా తన స్థానం నుంచి కదల్లేదు.

అధికారులు, కార్మికులు విగ్రహం కదలకపోవడంతో తలలు పట్టుకుంటున్న సమయంలో.. అక్కడికి ఎవరూ ఊహించని అతిథులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో కానీ, ఏకంగా 50కి పైగా కోతులు ఒక్కసారిగా గుంపుగా ఆ ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. కదలకుండా ఉన్న ఆ బజరంగబలి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా చేరాయి. ఈ అపురూప దృశ్యాన్ని చూసిన స్థానికులు, అధికారుల ఒక్కసారిగా ఆవాక్కయ్యారు. సాక్షాత్తూ ఆ రామభక్తుడికి అండగా నిలిచేందుకు వానర సైన్యం దిగివచ్చిందని భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. ఇంకేముంది.. ఈ వార్త క్షణాల్లో ఉజ్జయిని అంతటా దావానలంలా వ్యాపించింది.

Machines Fail Faith Wins The Ujjain Hanuman Idol That Heavy Cranes Couldn t Move

ఆధునిక యంత్రాలు కూడా స్వామిని కదల్చలేకపోవడం ముమ్మాటికీ దైవ సంకల్పమేనని భక్తులు ప్రగాఢంగా విశ్వసించారు. వెంటనే ఆ ప్రాంతమంతా జై శ్రీరామ్, జై భజరంగబలి నినాదాలతో హోరెత్తిపోయింది. భక్తులు భక్తిపారవశ్యంతో అక్కడే కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణం మొదలుపెట్టారు. స్వామివారికి పవిత్రమైన మహా హారతులు సమర్పించారు. ఈ అద్భుత దృశ్యాలు చూసిన తర్వాత అధికారులు కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. విగ్రహాన్ని బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే విగ్రహానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, తరలింపు పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Story first published: Saturday, September 12, 2026, 8:32 [IST]
Desktop Bottom Promotion