Latest Updates
-
పక్క రాష్ట్రంలో భర్త జాబ్..మరిది ప్రైవేట్ పార్ట్ కొరికిన వదిన..55 కుట్లు పడ్డాయ్ -
ఫైబర్ ఎక్కువ, ఆయిల్ తక్కువ.. కడుపుకు హాయినిచ్చే చౌ చౌ క్యారెట్ కూటు..చపాతీ,పూరీల్లోకి కిర్రాక్ టేస్ట్ -
సెర్బియా ఎన్నికల్లో జెన్ జీ సంచలనం..విద్యార్థుల ఆందోళన దెబ్బకి కుప్పకూలిన ప్రభుత్వం.. -
మాంసాహారాన్ని మించే రుచితో స్పైసీ సోయా చుక్కా..రైస్, చపాతీ, దోశలోకి బెస్ట్ సైడ్ డిష్ -
మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉందో లేదో..ఇలా తెలుసుకోండి -
జస్ట్ 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ పరోటా..ఈజీగా చేసుకోండిలా -
ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా.. -
ప్రేమించిన పాపానికి ఇంత ఘోరమా? తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించిన యువతి కుటుంబం! -
పంజాబీ జీరా ఆలూ ఫ్రై.. అన్నం, పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్! -
బీహారీ స్పెషల్ దాల్ పిఠీ..ఇది తింటే పిజ్జా, బర్గర్లు కూడా మర్చిపోతారు!
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే!
పన్నీర్ అనగానే చాలామంది భోజన ప్రియులకు నోటివెంట నీళ్లు ఊరుతాయి. పన్నీర్ తో చేసే ఏ వంటకమైనా సరే ఇట్టే ఆకట్టుకుంటుంది. సాధారణంగా మనం పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ టిక్కా లేదా కడాయ్ పన్నీర్ వంటివి తరచుగా రుచి చూస్తుంటాం.
మీరెప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా ట్రై చేశారా? పేరుకు కుర్మా అయినా, ఇది అద్భుతమైన స్టార్టర్ గా లేదా స్నాక్ గా మీ నాలుకకు ఒక సరికొత్త రుచిని పరిచయం చేస్తుంది. బయట కరకరలాడుతూ, లోపల మృదువుగా ఉండే ఈ వంటకం వీకెండ్ స్పెషల్ గా చేసుకోవడానికి పర్ఫెక్ట్ ఛాయిస్.

లాహోరీ పన్నీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
పన్నీర్ ఉడికించడానికి
పన్నీర్ - క్యూబ్స్‌లా కట్ చేసినవి
నీళ్లు - తగినన్ని
ఉప్పు - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
మసాలా కోటింగ్, వేయించడానికి
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - 2 టేబుల్ స్పూన్లు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పోపు కోసం
నూనె - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - కొద్దిగా
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
దంచిన మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా!
లాహోరీ పన్నీర్ కుర్మా తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు తీసుకొని స్టవ్ మీద మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేయండి.
-ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఆ నీటిలో వేసి కేవలం 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ ముక్కలు మృదువుగా మారడమే కాకుండా, ఉప్పు, పసుపు ఫ్లేవర్ ను చక్కగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత నీళ్లన్నీ పోయేలా వడకట్టి పన్నీర్ ను పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని, అందులో వడకట్టిన పన్నీర్ ముక్కలను వేయండి. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, బియ్యం పిండి, కార్న్‌ఫ్లోర్ వేసి నెమ్మదిగా కలపాలి. పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా ప్రతి ముక్కకూ మసాలాలు బాగా పట్టేలా సున్నితంగా కలుపుకోవాలి.
-స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, మసాలా పట్టించిన పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారి, కరకరలాడేలా వేయించుకోవాలి. వేగిన పన్నీర్ ముక్కలను తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి మార్చుకోండి.
-మరో పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, తాజా కరివేపాకు వేసి వేయించండి. అవి కాస్త చిటపటలాడాక, కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఈ పోపులో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే.. ఘుమఘుమలాడే వేడి వేడి లాహోరీ పన్నీర్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
