రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్‌ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ప్రేమ, అందం, కళ, సంపద, సుఖసంతోషాలు, వైవాహిక జీవితాలకు చిహ్నంగా శుక్రుడిని భావిస్తారు. అందుకే శుక్రుని స్థానంలో మార్పులు ఈ రంగాలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఈ క్రమంలో ఈ రోజు శుక్రుడు రాహువు అధిపతిగా ఉన్న స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. అక్టోబర్‌ 24 వరకు అక్కడే ఉండనున్నాడు. దీంతో ఈ నక్షత్ర మార్పు ప్రభావంతో ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

Planet Venus enters Swathi Nakshatra significant impact on these three zodiac signs

సింహరాశి

స్వాతి నక్షత్రంలోకి శుక్రుడి సంచారంతో సింహ రాశి వారి ప్రేమ జీవితంలో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే అపార్థాలు, గొడవలకి దారితీస్తుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో ఆటంకాల కారణంగా ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలు చేసుకోకుండా ఇరువురు తమ అభిప్రాయాలు, విలువలను గౌరవించుకోవాలి. వృత్తి, వ్యాపారపరంగా వ్యక్తులు ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు అస్సలు పనికిరాదు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందులోనూ పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు.

అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు!అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు!

వృశ్చిక రాశి

శుక్ర నక్షత్ర మార్పుతో వృశ్చిక రాశి వారు తమ భాగస్వామితో గొడవలు పడే అవకాశం ఉంది. మూడో వ్యక్తి కారణంగా మీ ప్రేమ, వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వారి మాటలు నమ్మి మీ దాంపత్యాన్ని చెడగొట్టుకోకండి. ప్రణాళిక లేకుండా చేసిన బడ్జెట్‌ ఖర్చును అదుపులో ఉంచదు. ఈ క్రమంలో కొత్త వ్యాపారం ఆలోచనలను విరమించుకోండి. కుటుంబపరంగా కొన్ని అనుకోని పరిమాణాలు ఎదుర్కోవచ్చు.

Planet Venus enters Swathi Nakshatra significant impact on these three zodiac signs

మీన రాశి

మీన రాశి వారు అక్టోబర్‌ 24 వరకు పలు కష్టనష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ప్రేమ, వైవాహిక జీవితంలో గందరగోళానికి గురవుతారు. ఇతరుల మాటలు విని భాగస్వామి గురించి తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. దీంతో వారి రిలేషన్‌షిప్‌లో ఉద్రిక్తతలు కలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాుపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవజ్ఞులైన సలహాలు తీసుకోవడం ఉత్తమం. సంతానం గురించి ఆందోళన చెందే అవకాశం ఉంది. కుటుంబీకులు, బయటి వ్యక్తులతో విభేదాలు తలెత్తవచ్చు.

దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.!దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.!

ఈ మూడు రాశుల వారు ప్రధానంగా ప్రేమ, వైవాహిక, వ్యాపారం, కుటుంబపరమైన విషయాల్లో గందరగోళం, నష్టాలు, విభేదాలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో స్వాతి నక్షత్రంలో శుక్రుడి ప్రభావం ఉన్నంత కాలం సదరు రాశుల వారు అప్రమత్తంగా ఉంటూ తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Saturday, September 12, 2026, 5:31 [IST]
Desktop Bottom Promotion