ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే!

ప్రస్తుతం చాలామంది ఉద్యోగుల జీవితాలు ఎలా అయ్యాయంటే..పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ లోనే మునిగిపోతున్నారు. నేటి మన కార్పొరేట్ జీవితం ఇలాగే ఉరుకులు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో తలనొప్పి, అలసట మాత్రమే కదా అని మనం తేలికగా తీసుకునే ఈ జీవనశైలి.. లోపల మన గుండెను ఎంతలా దెబ్బతీస్తుందో తెలుసా?

రోజుకు 9-10 గంటలు కదలకుండా కుర్చీకే అతుక్కుపోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి, గుండెపోటు ప్రమాదం పొంచి ఉంటోంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం మీ గుండెను ప్రమాదంలోకి నెడుతున్న నాలుగు ప్రధాన కారణాలు ఏంటో ఇక్కడ చూడండి.

Is Your 9 to 5 Job Killing Your Heart The Dark Side of Corporate Lifestyle

పని గంటలు - ప్రాణ సంకటం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిశోధనల ప్రకారం..వారానికి 35-40 గంటలు పనిచేసే వారితో పోలిస్తే 55 గంటల కంటే ఎక్కువ పనిచేసేవారికి పక్షవాతం, గుండె జబ్బుల ముప్పు చాలా ఎక్కువ. ఒకట్రెండు రోజుల్లోనే ఈ ప్రమాదం రాకపోయినా, ఏళ్ల తరబడి ఇదే దినచర్య కొనసాగితే గుండెకు చేటు తప్పదు.

ఒత్తిడి అనే సైలెంట్ కిల్లర్

టార్గెట్లు, డెడ్‌ లైన్లతో నిరంతరం ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి గుండె స్పందనను, రక్తపోటును అమాంతం పెంచుతాయి. అధిక రక్తపోటు ఎలాంటి ముందుస్తు లక్షణాలు లేకుండానే రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.

దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా!దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా!

సీట్లోనే కూర్చోవడం మరీ ప్రమాదం

ఉదయం ఒక గంట జిమ్‌ కెళ్లినా సరే, ఆఫీసులో 9-10 గంటలు కదలకుండా కూర్చుంటే ముప్పు తప్పదు. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలో క్యాలరీలు ఖర్చు కావు. ఫలితంగా ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటుకు దారితీస్తాయి.

నిద్ర కరువైతే.. గుండెకు ముప్పే

రాత్రిళ్లు మేల్కొని పనిచేస్తూ 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీకు బీపీ, షుగర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం అనేక రెట్లు పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా కొట్టుకోవాలంటే కంటినిండా నిద్ర అత్యవసరం.

ఉద్యోగం ముఖ్యం.. కానీ ప్రాణం అంతకంటే ముఖ్యం

-పనిలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి సీట్లోంచి లేచి కనీసం రెండు నిమిషాలు నడవండి.

-వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామం (వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్) చేయండి.

-రోజూ 7 నుంచి 9 గంటల ప్రశాంతమైన నిద్ర పోయేలా చూసుకోండి. పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి.

-స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటూ వాటిని అదుపులో ఉంచుకోండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, September 11, 2026, 20:15 [IST]
Desktop Bottom Promotion