అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి?

ప్రపంచంలోని మిగతా దేశాల్లో కంటే ఐఫోన్ క్రేజ్ మనదేశంలోనే ఎక్కువ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఐఫోన్ అంటే మనోళ్లకు ఎంత క్రేజ్ అంటే..అది కొనివ్వలేదని ఆత్మహత్యలు కూడా చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అదొక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అది చేతిలో ఉంటే తాము గొప్ప వ్యక్తుల్లా ఫీల్ అవుతుంటారు కొందరు.

అయితే తాజాగా మన మార్కెట్లోకి విడుదలైన ఐఫోన్ 18 ప్రో ధరలు చూస్తే సామాన్యుల కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. దీని ప్రారంభ ధర రూ.1,64,900గా నిర్ణయించగా, టాప్ మోడల్ ధర ఏకంగా రూ.4 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అమెరికాలో కేవలం రూ. 1,14,000 ఉండే ఐఫోన్.. మన దేశంలోకి వచ్చేసరికి వేల రూపాయలు ఎందుకు పెరుగుతోంది?

US vs India Why Are iPhones So Shockingly Expensive in India

ప్రస్తుతం ఆపిల్ సంస్థ లక్షలాది ఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తూ, అసెంబ్లింగ్ చేస్తున్నప్పటికీ ఈ ధరల వ్యత్యాసం ఎందుకు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇక్కడ చూడండి.

18 శాతం జీఎస్టీ భారం

భారతదేశంలో ఆపిల్ ప్రకటించే ధరలో ఇప్పటికే 18 శాతం జీఎస్టీ కలిసి ఉంటుంది. అంటే వెబ్‌ సైట్‌ లో మీకు కనిపించేదే ఫైనల్ ధర అన్నమాట. కానీ అమెరికాలో అలా కాదు. అక్కడ కంపెనీలు పన్నులు కలపకుండా బేసిక్ ధరను మాత్రమే ప్రకటిస్తాయి. కస్టమర్ కొనుగోలు చేసేటప్పుడు ఆయా రాష్ట్రాల నిబంధనలను బట్టి (0 నుండి 10 శాతం వరకు) సేల్స్ ట్యాక్స్ అదనంగా చెల్లించాలి. అందుకే పైకి చూసేటప్పుడు అమెరికా ధర తక్కువగా కనిపిస్తుంది.

దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా!దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా!

విడిభాగాల దిగుమతిపై సుంకాలు

ఆపిల్ మన దేశంలో తయారీని ముమ్మరం చేసిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ ఫోన్లు పూర్తిగా తయారు కావు, కేవలం విడిభాగాలను అసెంబుల్ చేస్తున్నారు. ఫోన్‌ కు అత్యంత కీలకమైన అడ్వాన్స్‌డ్ OLED స్క్రీన్లు, ప్రాసెసర్లు, కెమెరా సెన్సార్లు, మెమరీ చిప్‌ లను జపాన్, తైవాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ విడిభాగాలపై ప్రభుత్వం విధించే దిగుమతి సుంకాల భారం అంతా ఫోన్ తయారీ ఖర్చుపై పడి, అంతిమంగా కస్టమర్ జేబుకే చిల్లు పడుతోంది.

పంపిణీ, డెలివరీ ఖర్చులు

అమెరికాలో ఆపిల్ సంస్థకు భారీ సంఖ్యలో సొంత స్టోర్లు ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటుంది. మన దగ్గర పరిస్థితి వేరు. ఆపిల్ ఇప్పటికీ థర్డ్ పార్టీ రిటైలర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. డీలర్లకు ఇచ్చే కమీషన్లు, గోడౌన్స్ నిర్వహణ, స్థానిక రవాణా ఖర్చులు ఇవన్నీ కలుపుకుని ఫోన్ తుది ధరను అమాంతం పెంచేస్తున్నాయి.

ఆపిల్ ప్రీమియం వ్యాపార వ్యూహం

అన్నింటికంటే ముఖ్యంగా, భారతదేశంలో తనను తాను ఒక ప్రీమియం బ్రాండ్ గా నిలబెట్టుకోవాలన్నది ఆపిల్ వ్యూహం. డాలర్-రూపాయి మారకపు విలువల్లో వచ్చే ఆటుపోట్లు, స్థానిక మార్కెట్ పరిస్థితులు, దీర్ఘకాలిక లాభాలను బేరీజు వేసుకుని ఆపిల్ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుంది. వారు అమెరికా ధరను నేరుగా రూపాయల్లోకి మార్చరు. మన మార్కెట్ స్థాయిని బట్టి ప్రత్యేకంగా ధరను నిర్ణయిస్తారు. ఇన్ని పన్నులు, దిగుమతి సుంకాలు, కమీషన్లు, వ్యాపార వ్యూహాలు దాటుకుని మన చేతికి వస్తోంది కాబట్టే మన దగ్గర ఐఫోన్ ధర ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటోంది.

Story first published: Friday, September 11, 2026, 22:51 [IST]
Desktop Bottom Promotion