Latest Updates
-
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.!
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్!
16 గంటల సుదీర్ఘ సమయం పాటు ఖాళీ కడుపుతో ఉండటం.. ఈ గ్యాప్ లో కేవలం అర సీసా నెయ్యి మాత్రమే తీసుకోవడం.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుతం ఫిట్ నెస్ ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్. ప్రముఖ పోషకాహార నిపుణురాలు శిల్పా అరోరా నెయ్యి ఉపవాసం అనే కొత్త ట్రెండ్‌ను తెరపైకి తెచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఆమె పాటిస్తున్న విధానం ప్రకారం.. సాయంత్రం 6:30 గంటలకే రాత్రి భోజనాన్ని ముగించేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు అంటే ఏకంగా 16 గంటల పాటు ఘనరూప ఆహారం ఏమీ తీసుకోరు. ఈ సమయంలో ఆమె కేవలం నీళ్లు, నెయ్యి మాత్రమే తీసుకుంటారు. ఉదయం వేళ ఆకలిగా అనిపిస్తే బ్లాక్ కాఫీలో కాస్త నెయ్యి కలుపుకుని తాగుతారు. ఈ విధంగా చేయడం వల్ల ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ తగ్గి, ప్రశాంతమైన నిద్రను ఇచ్చే మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుందని ఆమె వివరిస్తున్నారు.

నెయ్యి ఉపవాసం వల్ల లాభాలు ఉన్నాయా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరిగించిన స్వచ్ఛమైన నెయ్యిని తీసుకోవడాన్నే నెయ్యి ఉపవాసం అంటారు. ఇతర ఆహార పదార్థాలు తినడానికి ముందు నెయ్యి తీసుకోవడం వల్ల, శరీరానికి పోషకాలు త్వరగా అందుతాయని చాలామంది నమ్ముతారు. నెయ్యి మన జీర్ణవ్యవస్థను చురుకుగా మార్చి, పైత్యరస ఉత్పత్తిని పెంచుతుంది.
అంతేకాకుండా నెయ్యిలో ఉండే షార్ట్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఇందులో కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. పరిమిత మోతాదులో నెయ్యి తీసుకోవడం వల్ల పేగుల లోపలి పొర మృదువుగా మారి మలబద్ధకం వంటి సమస్యలు ఇట్టే దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరో వాదన ఏం చెబుతోంది?
నాణేనికి మరోవైపు ఉన్నట్లు.. ఈ ట్రెండ్ పై మరికొందరు పోషకాహార నిపుణురాలు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ కడుపుతో నెయ్యి తాగితే అద్భుతాలు జరిగిపోతాయని చెప్పడానికి ప్రస్తుతానికి ఎలాంటి వైద్య, శాస్త్రీయ ఆధారాలు లేవని, శరీరంపై నెయ్యి చూపే ప్రభావం అది ఏ సమయంలో తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉండదని.. రోజంతా మనం ఎన్ని కేలరీలు తీసుకున్నాం? ఎంత శాచురేటెడ్ ఫ్యాట్ తీసుకున్నాం? మన మొత్తం డైట్ ఏంటి? అన్నదే ముఖ్యం అని మరికొందరు వివరిస్తున్నారు.
ఈ ఉపవాసానికి ఎవరు దూరంగా ఉండాలి?
నెయ్యిలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
-లిపిడ్ ప్రొఫైల్ సమస్యలు ఉన్నవారు, జీర్ణకోశ సమస్యలు, తరచుగా అజీర్తితో బాధపడేవారు,శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు
-గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు,మధుమేహం (డయాబెటిస్)తో బాధపడుతున్న వాళ్లు దీనికి దూరంగా ఉండాలి.
కాబట్టి ఈ నెయ్యి ఉపవాసం ప్రారంభించే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్ ని లేదా సర్టిఫైడ్ పోషకాహార నిపుణులను సంప్రదించడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
