Latest Updates
-
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.!
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.!
వర్షాకాలంలోనూ వేడి వాతావరణం ఉక్కపోతతో అల్లాడిస్తోంది. ఫ్యాన్, ఏసీలు మళ్లీ చక్రం తిప్పుతున్నాయి. బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా హ్యుమిడిటీతో దాహార్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మనం తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్. మన రోజు మొదలయ్యేది టిఫిన్‌తోనే కాబట్టి.. హెల్తీగా పోషకాలు ఎక్కువగా ఉన్న టిఫిన్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటిలో ది బెస్ట్ బార్లీ జావ. దీనిని వారంలో రెండు మూడు సార్లయినా తీసుకుంటే ఒంట్లో వేడిని తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తుంది. బార్లీ జావ ఎలా తయారుచేయాలో చూద్దాం..

బార్లీ జావ తయారికి కావాల్సిన పదార్థాలు
బార్లీ గింజలు- గ్లాసున్నర
ఉప్పు- రుచికి సరిపడా
పెరుగు- గ్లాసు
అల్లం- చిన్న ముక్క
క్యారెట్- ఒకటి
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి- నాలుగు
కరివేపాకు- మూడు రెబ్బలు
బార్లీ జావ తయారీ విధానం
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.!
బార్లీ జావ తయారీ కోసం ముందుగా బార్లీ గింజలను రెండు సార్లు కడిగి గ్లాసున్నరకి మూడు గ్లాసుల నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్‌లో ఉడికించాలి. లేదా అన్నం మాదిరిగా అయినా గిన్నెలో వండుకోవచ్చు.
కుక్కర్‌లో అయితే మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. మూడు విజిల్స్ తర్వాత మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత మిక్సీలో లేదా రోట్లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి.

రుబ్బుకున్న తర్వాత అందులో ఏ గ్లాసుతో అయితే బార్లీ తీసుకున్నామో అదే గ్లాసుతో పెరుగు తీసుకుని ఉడికిన దాంట్లో కలుపుకోవాలి. అదే గ్లాసుతో నీళ్లు కూడా పోసుకోవాలి. ఉప్పు సరిచూసుకుని గరిటెతో బాగా కలియతిప్పాలి.
ఇప్పుడు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ తురుముకోవాలి. వీటిని ప్రిపేర్ చేసిపెట్టుకున్న బార్లీలో కలుపుకోవాలి.
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.!
స్టవ్‌పైన చిన్న పాన్ పెట్టుకుని టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి బార్లీ జావలో కలుపుకోవడమే. హెల్తీ బార్లీ జావ రెడీ.
డివేడిగా, హెల్తీగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు ఇందులోని ఫైబర్ జీర్ణక్రియ మెరుగ్గా జరిగ్గేలా చేస్తుంది. పొట్టను తేలికగా ఉంచుతుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ తీసుకోవచ్చు. డయాబెటిస్ బాధితులు వారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన టిఫిన్ ఇది. మధ్యాహ్నం లంచ్‌లో కూడా బెస్ట్ ఆప్షన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
