Latest Updates
-
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.?
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.?
ఈ రోజుల్లో చాలా వరకు దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. కనీసం పది జంటల్లో ఒక జంటయినా పిల్లలు కావడం లేదని ఆస్పత్రులను ఆశయిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఒక యువకుడు ఇదే సమస్యతో ఆస్పత్రికి వెళ్లాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. గైనకాలజిస్టులు చేసిన వంధ్యత్వ పరీక్షల్లో ఊహించని పరిణామం ఎదుర్కొన్నాడు. అతని శరీరంలో అసాధారణం గర్భాశయంతో పలు మార్పులను గమనించారు. దీంతో ఖంగుతిన్న వైద్యులు దానికి కారణాలను విశ్లేషించారు.

దేశ రాజధాని ఢిల్లీలో దిగ్భ్రాంతి చెందే కేసు వెలుగులోకి వచ్చినట్లు అక్కడి ఆర్‌జీ హాస్పిటల్స్ చీఫ్ యూరాలజిస్ట్ డా. సుశీక్ ఖర్బందా తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల సంతానలేమి సమస్యతో 24 ఏళ్ల యువకుడు ఆస్పత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో వైద్యులు ఇన్‌ఫర్టిలిటీకి సంబంధించి అంతర్గత పరీక్ష నిర్వహించారు. ఈ టెస్ట్‌లో అతని పొత్తికడుపులో పూర్తిగా అభివృద్ధి చెందిన గర్భాశయం ఉన్నట్లు కనుగొన్నారు. అయితే అతడు మాత్రం ఈ సమస్యను టెస్ట్ చేసేవరకు గుర్తించలేదు.. కారణం అతను అందరు మగవారిలాగానే పురుష లక్షణాలను కలిగి ఉండి సాధారణ జీవితం గడుపుతున్నాడు.

వీర్య విశ్లేషణలో ఏం తేలిందంటే..
పురుషుల్లో సంతానలేమి సమస్యకు కారణాలు తెలుసుకునేందుకు ముందుగా వీర్యకణాల పరీక్ష నిర్వహిస్తారు. అదే సెమెన్ అనాలసిస్. యువకుడి వీర్యాన్ని పరీక్షించగా అందులో శుక్రకణాలు ఏవీ కనిపించకపోవడంతో అతని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో వైద్యులకు అర్థమైంది. సదరు యువకుడి వృషణ కోశంలో వృషణాలు లేవని తేలడంతో ఈ పరిస్థితిని అజూస్పెర్మియాగా నిర్ధారించారు. దీని తర్వాత జెనెటిక్, క్రోమోజోమ్ పరీక్షల్లో క్రోమోజోమ్ నమూనా ఉన్నట్లు గుర్తించారు. కానీ అల్ట్రాసౌండ్, ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయడంతో అసలు విషయం బయటపడింది. అతని పొత్తి కడుపులో పూర్తిగా ఉన్న గర్భాశయంతో పాటు అండాశయాలను పోలిన రెండు వృషణాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ పరిస్థితిని పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారని ఆండ్రాలజీ నిపుణులు చెబుతున్నారు. ఇది అత్యంత అరుదైన పరిస్థితి అని చెప్పారు. సాధారణంగా తల్లి గర్భంలో మగ పిండం ఉన్నప్పుడు ఏఎంహెచ్ చర్య కారణంగా గర్భాశయం ఏర్పడకుండా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సరిగా జరగకపోతే గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్ నిర్మాణాలు మగ పిండం శరీరంలోనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 300 కంటే తక్కువ కేసులు నమోదైనట్లు సమాచారం. ఇలాంటివి బాల్యంలోనే నిర్ధారణ అవుతాయి. కానీ ఈ యువకుడి విషయంలో ఆలస్యం జరిగినట్లు చెబుతున్నారు.

క్యాన్సర్ ప్రమాదాన్ని నిర్ధారించడానికి చేసే శస్త్రచికిత్స
కాగా ఈ యువకుడి విషయంలో పొత్తికడుపులో చిక్కుకుపోయిన కిందికి దిగని వృషణాల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా ఫ్యూచర్‌లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండొచ్చన్నారు. మొత్తానికి లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా గర్భాశయంతో పాటు రెండు వృషణాలను తొలగించారు. అదేవిధంగా బయాప్సీలోనే క్యాన్సర్ తొలి లక్షణాలు కూడా బయటపడ్డాయి. దీంతో సకాలంలో చికిత్స అందించగలిగినట్లు వైద్యులు వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
