Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సేమియా కేసరి.. సంక్రాంతి తీపి మొత్తం ఇందులోనే,ఎలా చేసుకోవాలంటే..
తిని మైమరిచిపోవడం అనే మాట కొన్నింటికే ఆపాదించగలం. ఆ కొన్నింటిలో సేమియా కేసరి ఒకటి. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్న తర్వాత మొత్తం సేమియా నాకే కావాలి అని అంటారు. అంత రుచికరంగా ఉంటుంది. సేమియా కేసరి ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సేమియా కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు,సేమియా కేసరి తయారీ విధానం ఇక్కడ చూడండి.
సేమియా కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు
-1 కప్పు సేమియా
-1 కప్పు పంచదార
-1 కప్పు ఎండు ద్రాక్ష
-1/4 పచ్చ కర్పూరం
-కొంచెం కుంకుమ పువ్వు
-2 కప్పుల నీళ్లు
-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు
-1/4 టేబుల్ స్పూన్ యాలకల పొడి
-4 టేబుల్ స్పూన్ల నెయ్యి

సేమియా కేసరి తయారీ విధానం
-ముందుగా చిటెకెడు కుంకుమ పువ్వులో కొద్దిగా కలర్,నీళ్లు పోసి
పక్కనపెట్టుకోండి.
-పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చెయ్యండి.
-నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసి దోరగా వేగిన తర్వాత ఇందులో ఎండుద్రాక్ష వేసి కొంచెం వేసి పాన్ లో నుంచి వీటిని ఓ బౌల్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు పాన్ లో మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి అందులో సేమియా వేసి ఎర్రగా వేగిన తర్వాత దాన్ని ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-తర్వాత అదే పాన్ లో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో వేయించిన సేమియా వేసి ఉడికించండి.
-పూర్తిగా ఉడకినవ్వకుండా కాస్త చెమ్మగా ఉండేదాకా ఉడికించాలి. అంటే 99శాతం ఉడకాలి.
-అప్పుడు కప్పు పంచదార అందులో వేసి కరిగించండి.
-తర్వాత కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి దాదాపు 8 నిమిషాల దాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.
-కాస్త జారుగా ఉన్నప్పుడే అందులో యాలకల పొడి,వేపుకున్న జీడిపప్పు ఎండుద్రాక్షలు, చిటికెడు పచ్చకర్పూరం వేసి కలిపి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ సేమియా కేసరి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications