Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
టీ, కాఫీలు పక్కన పెట్టండి..మిక్స్డ్ వెజ్ సూప్ ట్రై చేయండి..చలి పరార్,ఆరోగ్యానికి ఆరోగ్యం
బయట చలి గాలులు వీస్తున్నప్పుడు సాయంత్రం వేళ వేడి వేడి టీ లేదా కాఫీ తాగాలనిపిస్తుంది. కానీ ఈసారి వాటికి బదులుగా ఒక కప్పు వేడి వేడి మిక్స్డ్ వెజిటబుల్ సూప్ ప్రయత్నించండి. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడంలో ఈ సూప్ అద్భుతంగా పనిచేస్తుంది.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి ఈ సూప్ ఒక దివ్యౌషధం. తాజా క్యారెట్లు, బీన్స్, క్యాబేజీ, ఘాటైన అల్లంవెల్లుల్లి మిశ్రమంతో తయారయ్యే ఈ సూప్.. రెస్టారెంట్ రుచిని తలపిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్దీ అండ్ టేస్టీ సూప్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
క్యారెట్లు- పావు కప్పు
బీన్స్ - పావు కప్పు
క్యాబేజీ- పావు కప్పు
క్యాప్సికమ్- 2 టేబుల్ స్పూన్లు
స్వీట్ కార్న్ - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి తరుగు- 1 టేబుల్ స్పూన్
అల్లం తరుగు - 1 టీస్పూన్
పచ్చిమిర్చి తరుగు - 1
స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు) - తెలుపు, ఆకుపచ్చ భాగాలు
మిరియాల పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
సోయా సాస్ - 1 టీస్పూన్
వెనిగర్ లేదా నిమ్మరసం - 1 టీస్పూన్
వెన్న లేదా నూనె - 1 టేబుల్ స్పూన్
నీరు లేదా వెజిటబుల్ స్టాక్ - 3 నుండి 4 కప్పులు
కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
-ముందుగా ఒక లోతైన పాన్ లేదా కడాయిలో వెన్న లేదా నూనె వేడి చేయండి.
-వెన్న కరిగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, చ్చిమిరపకాయలను వేసి పచ్చి వాసన పోయి, మంచి సువాసన వచ్చే వరకు సుమారు 30 సెకన్ల పాటు వేయించండి.
-ఇప్పుడు తరిగిన ఉల్లికాడల (స్ప్రింగ్ ఆనియన్స్) తెలుపు భాగాన్ని వేసి, ఆ వెంటనే క్యారెట్లు, బీన్స్, స్వీట్ కార్న్ వేసి పెద్ద మంట మీద 2 నిమిషాలు వేయించండి. ఇలా చేయడం వల్ల కూరగాయలు మెత్తగా అయిపోకుండా, తినేటప్పుడు క్రంచీగా తగులుతాయి. చివరగా క్యాప్సికమ్, క్యాబేజీని జోడించండి వీటిని ఎక్కువ సేపు ఉడికించాల్సిన పనిలేదు.
-కూరగాయలు వేగిన తర్వాత 3-4 కప్పుల నీరు పోసి రుచికి సరిపడా ఉప్పు,మిరియాల పొడి కలపండి. సూప్ బాగా మరిగే వరకు వేచి ఉండి, ఆ తర్వాత మంటను తగ్గించి 5 నుండి 7 నిమిషాల పాటు మరిగించండి.
-సూప్ చిక్కగా రావడం కోసం ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొద్దిగా నీటితో ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న సూప్ లో నెమ్మదిగా పోస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి.
-చివరగా సోయా సాస్, వెనిగర్ లేదా నిమ్మరసం వేసి కలపండి. స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన ఉల్లికాడల ఆకుపచ్చని భాగం, కొత్తిమీర చల్లుకోండి.
-అంతే వేడి వేడి, పోషకాలతో నిండిన మిక్స్డ్ వెజిటబుల్ సూప్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
