Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
Central Bank Gold Buying Crashes 80% in January, Falls to Just 5 Tonnes WGC -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
Gold Rates in India 100 grams Dropped RS 31,100 know 24k 22k 18k Yellow Metal prices on March 4
నెల రోజులు నిల్వ ఉండే ఘమఘమలాడే బాదం పొడి..తయారీ విధానం ఇదే
బయట దొరికే కృత్రిమ రంగులు, ఎక్కువ మోతాదులో ఉండే చక్కెరతో కూడిన పానీయాల కంటే, మన చేతులతో స్వయంగా చేసుకునే పొడులు ఎంతో ఆరోగ్యకరం, రుచికరం. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తాగే బాదం పాలు కోసం వాడే పొడిని దుకాణాల్లో కొనాలంటే చాలా ఖరీదు ఉంటుంది. పైగా అందులో ప్రిజర్వేటివ్స్ కూడా ఉండవచ్చు.
కానీ తక్కువ ఖర్చుతో, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా, కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పొడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ బాదం పొడి కేవలం పాలల్లోకే కాదు, పాయసం, ఖీర్, రసమలై వంటి స్వీట్స్ తయారీలో వాడితే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. బాదం పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బాదం పప్పులు - 1 కప్పు (200-250 గ్రాములు)
జీడిపప్పు - 150 గ్రాములు
పిస్తా పప్పులు - గుప్పెడు
చక్కెర - రుచికి సరిపడా
ఏలకులు - 10
పసుపు - చిటికెడు
కుంకుమ పువ్వు - కొన్ని రేకులు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి పాన్ లేదా కడాయిని పెట్టి అందులో బాదం పప్పులను వేసి దోరగా వేయించండి.
-బాదం కొంచెం వేడెక్కాక అందులో జీడిపప్పు, పిస్తా పప్పులను కూడా వేసి వేయించండి. ఈ పప్పులన్నీ లోపలి వరకు వేగి, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. ఇలా వేయించడం వల్ల పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
-పప్పులు మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, వాటిని ఒక పల్లెంలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
-పప్పులు పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. వీటితో పాటు చక్కెర, ఏలకులు, చిటికెడు పసుపు వేయండి. మిక్సీని ఒకేసారి వేగంగా తిప్పకూడదు. అలా చేస్తే బాదంలోని నూనె బయటకు వచ్చి ముద్దగా అయిపోతుంది. కాబట్టి మిక్సీని ఆపుతూ, ఆన్ చేస్తూ మధ్యమధ్యలో స్పూన్ తో కలుపుతూ మెత్తటి పొడిలా చేసుకోవాలి.
-మిక్సీ పట్టిన ఈ పొడిని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి చల్లారనివ్వాలి. ఆఖరులో కుంకుమ పువ్వు రేకులను ఈ పొడిలో వేసి బాగా కలపాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘమఘమలాడే బాదం పౌడర్ రెడీ. ఈ పొడి పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేని ఒక స్టీల్ డబ్బాలో లేదా గాజు సీసాలో వేసి గట్టిగా మూత పెడితే నెల రోజుల పాటు తాజాదనం కోల్పోకుండా నిల్వ ఉంటుంది.
బాదం పాలు తయారు చేయడం ఎలా?
మీరు ఎప్పుడు బాదం పాలు తాగాలనుకున్నా.. ఒక గ్లాసు వేడి పాలు లేదా
చల్లని పాలు తీసుకోండి. అందులో 2 చెంచాల బాదం పౌడర్ వేసి బాగా కలపండి.
అవసరమైతే మరికొంత చక్కెర వేసుకోవచ్చు. అంతే అమృతం లాంటి బాదం పాలు
రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












