Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Semiya Pakodi: డిఫరెంట్ రుచితో సేమియా పకోడీ.. ఒకసారి తింటే ఉల్లిపకోడీని మర్చిపోతారు!
మన దేశంలో పకోడీ అత్యంత పాపులారిటీ కలిగిన ఒక స్నాక్. ఈ పకోడీని ఎంతో మంది ఇష్టంగా తింటారు. ఎంత తిన్నా ఈ పకోడీ తినాలనే అనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఈ పకోడీని ఉల్లిపాయలతో చేస్తుంటారు. అయితే కొంచెం కొత్త రుచి కావాలనుకున్న వారు, డిఫరెంట్ స్టైల్‌లో పకోడీ చేసుకోవాలని అనుకుంటున్న వ్యక్తులు సేమియాతో పకోడీ చేసుకోవచ్చు. ఇది విభిన్నమైన రుచితో ఉండడంతో పాటు కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. అయితే ఈ సేమియా పకోడీని ఎలా చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.

సేమియా పకోడికి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల సేమియా
- ఒక కప్పు శెనగ పిండి
- పొడుగ్గా తరుక్కున్న రెండు ఉల్లిపాయలు
- సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి
- అయిదు రెబ్బలు కరివేపాకు తరుగు
- పావు టీస్పూన్ వంట సోడా
- రెండు టేబుల్ స్పూన్ల కారం
- ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా
- కొంచెం కొత్తిమీర తరుగు
- రుచికి సరిపడా ఉప్పు
- ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె
సేమియా పకోడీ తయారీ విధానం
ముందుగా సేమియా ఉడికించుకునేందుకు కావాల్సిన నీరును ఒక గిన్నెలో పోసుకొని నీటిని వేడి చేసుకోవాలి. నీళ్లు కొంచెం వేడయ్యాక అందులో సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. సేమియా పూర్తిగా మెత్తగా అయ్యే విధంగా కాకుండా, కొంచెం పలుకుగా ఉండే విధంగా ఉడికించుకోవాలి. సేమియా 60% మాత్రమే ఉడకాలి. గుర్తుంచుకోండి పలుకులుగా ఉండడం చాలా ముఖ్యం.
ఉడికిన సేమియాను పూర్తిగా చల్లార్చుకోవాలి. సేమియాను చల్లార్చుకోవడానికి చల్లటి నీటితో వడగట్టుకోవచ్చు కూడా. ఆ తరువాత చల్లారిన సేమియాను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సేమియా పూర్తిగా చల్లారిన తరువాత పిండి మాదిరిగా చేసుకోవాలి.
ఇప్పుడు పూర్తిగా చల్లారిన సేమియాను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులోనే ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, శెనగ పిండి, వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, చాట్ మసాలా వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముందుగా నీళ్లు వేయకుండానే రుబ్బుకోవాలి. ఆ తరువాత పిండి కొంచెం పొడిగా ఉంటే.. నీళ్లు చల్లుకుంటూ రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న తరువాత సిద్ధమైన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి పకోడీలు వేయించుకునేందుకు సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాకా పకోడీ పిండిని తీసుకొని పకోడీలు వేసుకోవాలి. ఆ పకోడీలు గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా వేగాక, పకోడీలను నూనెలోనుంచి ఒక ప్లేట్‌లో తీసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి, కరకరలాడే సేమియా పకోడీ సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
