Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి!
ఎండల తీవ్రత పెరిగేకొద్దీ ఎప్పుడూ ఏదో ఒకటి చల్లగా, తీయగా, రుచికరంగా తినాలని మనసు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. ఈ టైంలో మామిడి పండ్లతో ఏదైనా కొత్త డెజర్ట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మీకు తీపి తినాలని అనిపించి, అది కూడా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత కమ్మగా, చల్లగా ఉండాలనుకుంటే..మ్యాంగో సేమియా ఫలూదాను కచ్చితంగా తయారు చేసుకోవాల్సిందే. బయట దొరికే ఐస్‌క్రీమ్ ల కంటే ఎంతో ఆరోగ్యకరమైన ఈ రెసిపీని ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.

మ్యాంగో ఫలూదా తయారీకి కావలసిన పదార్థాలు
పండిన మామిడి పండ్లు - 4
సేమియా - 1 కప్పు
చిక్కటి పాలు - అర లీటరు
చక్కెర - 1 కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, పిస్తా) - తగినన్ని
మిల్క్ పౌడర్ - కొద్దిగా
మ్యాంగో ఫలూదా తయారీ విధానం
-నాలుగు పండిన మామిడి పండ్లను శుభ్రంగా కడిగి, పైన ఉన్న తొక్కను తీసేయండి. ఇందులో ఒక మామిడి పండును డెకరేషన్ కోసం, ఫలూదా తినేటప్పుడు మధ్యలో పంటికి తగిలేలా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
-మిగిలిన మూడు మామిడి పండ్ల గుజ్జును తీసుకుని మిక్సీ జార్ లో వేయండి. ఎక్కడా ముక్కలు లేకుండా చాలా మెత్తని పేస్ట్ లా (ప్యూరీలా) గ్రైండ్ చేసి, ఒక గిన్నెలోకి తీసుకుని సిద్ధంగా ఉంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ లేదా కడాయి పెట్టుకోండి. అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక సేమియాను వేసి, మంటను సిమ్ లో ఉంచి మంచి సువాసన వచ్చేంతవరకు దోరగా వేయించుకోండి.
-సేమియా వేగిన తర్వాత అందులో అర లీటరు చిక్కటి పాలను పోయండి. పాలు వేడెక్కిన తర్వాత అందులో రుచికి సరిపడా చక్కెర, కమ్మని వాసన కోసం యాలకుల పొడి వేసి బాగా కలపండి. సేమియా పాలల్లో మెత్తగా ఉడికేంత వరకు సన్నని మంటపై ఉడకనివ్వండి.
-సేమియా బాగా ఉడికి, పాల మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మామిడి గుజ్జు వేస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.
-మిశ్రమం చల్లారాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి ప్యూరీని వేసి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలపండి. మీకు ఫలూదా మరింత క్రీమీగా, రిచ్ గా కావాలంటే ఈ సమయంలో కొద్దిగా మిల్క్ పౌడర్ లేదా కండెన్స్డ్ మిల్క్ కూడా కలుపుకోవచ్చు.
-అంతే ఎంతో రుచికరమైన మీ మ్యాంగో ఫలూదా రెడీ. దీనిని కనీసం రెండు, మూడు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచండి. బాగా చల్లారిన తర్వాత బయటకు తీసి, గ్లాసులలో సర్వ్ చేసుకోండి. పైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, సన్నగా తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి తింటుంటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
