Latest Updates
-
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా?
బ్రెడ్ - చోలే ఛాట్...

కావలసిన పదార్ధాలు:
చోలే: 2cups
బ్రెడ్ : 4slices
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 3
పొటాటో: 2
టమోటో: 2
అల్లం వెల్లుల్లి ముద్ద : 1tsp
చోలే మసాల :1tsp
కొత్తిమీర : ఒక కట్ట
ఉప్పు: రుచికి తగినంత
కారం : తగినంత
పసుపు: 1tsp
సన్నకారప్పూస: కొద్దిగా
నూనె : 2tbsp
ఛాట్ మసాల: 1tsp
నిమ్మరసం : 1tsp
జీలకర్ర : 1tsp
కరివేపాకు : ఒక రెమ్మ
తయారు చేయు విధానం:
1. శనగలను నానబెట్టుకోవాలి. నూనె వేడిచేసి జీలకర్ర,కరివేపాకు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి దోరగా వేయించాలి .
2. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి,ఆలూ ముక్కలు,శనగలు వేసి కలపాలి.
3. రెండు నిముషాలు వేయించి,ఉప్పు,కారం,పసుపు,వేసి కలిపి టమాట ముక్కలు కూడా వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి పాన్ మూత పెట్టెయ్యాలి. ఆరేడు విజిల్స్ రానిస్తే శనగలు మెత్తగా ఉడుకుతాయి, స్టీం పోయిన తరువాత తీసి చోలే మసాల ,కొత్తిమీర వేసి కూర
చిక్కబడేదాక ఉడికించుకోవాలి. ఈలోగా బ్రెడ్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో వేయించి తీసుకోవాలి. లేదా నెయ్యి, వెన్న వేసి తవాపై కూడా టోస్ట్ చేసుకోవచ్చుకానీ క్రిస్ప్ గా ఉండాలి.
4. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు ఒక ప్లేట్లో పెట్టి పైన చోలే కూర వేయాలి. కొన్ని బ్రెడ్ ముక్కలు పైన కూడా వేయాలి. సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, కొత్తిమీర, కొంచెం ఛాట్ మసాల చల్లి, నిమ్మరసం వేసి పైన సన్న కారప్పూసతో అలంకరిస్తే నోరూరించే ఛాట్ రెడీ అవుతుంది.



Click it and Unblock the Notifications











