Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
దీపావళి క్యారెట్ గులాబ్ జామ్

క్యారెట్ తరుము: 1cup
కొబ్బరి తురము: 1cup
పంచదార: 2 cups
గులాబ్ జామ్ పౌడర్: 250grms
జీడిపప్పు: 50grms
బాదం పప్పు: 50grms
పంచదార(పాకానికి): 1/2kg
నెయ్యి: 1/2cup(వేయించడానికి)
యాలకుల పొడి: 1tsp
తయారు చేయు విధానం:
1. ఒక పాన్ స్టవ్ పై ఉంచి, కొద్దిగా నెయ్యి వేసి ముందుగా అందులో జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు వేసి అవి వేగాక, క్యారెట్ తురుము వేసి వేగించాలి. తరువాత కొబ్బరి తురుము కూడా వేసి అయిదు నిమిషాలు వేగించి, తరువాత పంచదార వేసి కాస్త దగ్గరగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చివరగా యాలకుల పొడి చల్లి దించేయాలి.
2. తరువాత మరో పాత్ర స్టవ్ పై ఉంచి అందులో కొద్దిగా నీళ్లు, పంచదార వేసి లేత పాకం వచ్చే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. సువాసన కోసం ఈ పాకంలో యాలకుల పొడిగాని, రోజ్ వాటర్ గాని కలుపుకోవచ్చు.
3. తర్వాత గులాబ్ జామ్ పౌడర్ లో నీళ్లు పోసి ఉండలు చేసుకునేందుకు వీలుగా పిండిని కలిపి అయిదు నిమిషాల పాటు నాననివ్వాలి.
4. ఈలోపు క్యారెట్ హల్వాను కూడా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి.
5. తర్వాత గులాబ్ జామ్ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న పూరీలా ఒత్తి అందులో క్యారెట్ ఉండను ఉంచి అంచులు కలిపేసి ఉండగా చేసుకోవాలి.
6. ఇలా తయారైన ఉండలను చిన్న మంటపై ముదురు రంగు వచ్చేంత వరకు నేతిలో వేగించి తీసి పంచదార పాకంలో వేయాలి.



Click it and Unblock the Notifications











