Latest Updates
-
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు!
క్రిస్మస్ స్పెషల్ బనానా చాకో చిప్స్ మఫిన్ రిసిపి
క్రిస్‌మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది క్రిస్‌మస్ ట్రీ. పిల్లలకయితే క్రిస్‌మస్ తాత గుర్తుకువస్తాడు. ఇంకా ఏం గుర్తుకువస్తాయి అని అడిగితే...ప్రశ్న పూర్తవకుండానే జవాబు వచ్చేస్తుంది. నోరూరించే కేకులని. ఒకటి రెండూ కాదు ఆ సమయంలో బోలెడు రకాల కేకులు కెవ్వుమని కేక వేస్తాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాకులతో రెడీ అయిపోతారు.
క్రిస్‌మస్‌ని కేకుతో ఆహ్వానిస్తారు. తియ్యగా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సమయం. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్న వారికి సైతం ఆర్డర్ చేసి మరీ అందచేస్తారు. కొందరు మాత్రం ఇంట్లో చేసుకోవాలనుకుంటారు. అందుకే ఇక్కడ మీకోసం ఒక బనానా చాకో చిప్ రిసిపిని తయారుచేసే విధానంతో అంధిస్తున్నాం. ఈ స్పెషల్ బనానా చాకో చిప్ రిసిపిని మీరు కూడా ప్రయత్నించి మీ క్రియేటివిటీని జోడించి డెకొరేట్ చేయండి...కేక్ కట్ చేసి ఇంటికి వచ్చిన అతిథులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తీయగా అందించండి...

కావల్సినపదార్థాలు:
అరటిపండ్లు - 3 (బాగా పండినవి)
ఛాకోచిప్స్ - 1 cup
గుడ్లు - 2
బట్టర్ - 2 tbsp
వెనీలా ఎసెన్స్ - 1/4th tsp
బనానా ఎసెన్స్ - 1/4thtsp
మైదా - 2 cups
బేకింగ్ సోడా - 1/4th tsp
బేకింగ్ పౌడర్ - 1/4th tsp
పంచదార - 2 cups
మీ ఆత్మీయుల కోసం క్రిస్మస్ కు ఎలాంటి గిప్ట్స్ ఎంపిక చేసుకోవాలి...?
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరటిపండు ముక్కలు వేసి మెత్తగా మ్యాష్ చేయాలి. బాగా పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకవోాలి.
2. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో గుడ్డు, వెనీలా ఎసెన్స్, మరియు బట్టర్, వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. అదే బౌల్లో మైదా, బనానా ఎసెన్స్, బేకింగ్ సోడా మరియు పంచదార వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు ఇందులో మ్యాష్ చేసిన బనానా మిశ్రమాన్ని వేయాలి .
5. అలాగే చాకోచిప్స్ ను కూడా అందులో వేయాలి. తర్వాత మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు స్కూప్ తీసుకొని , అందులోనికి ఈ బనానా మిక్స్ ను వేసి మఫిన్ మోల్డ్ లో అమర్చాలి.
7. తర్వాత ఓవెన్ లో 20 నిముషాలు పెట్టి 150డిగ్రీల్లో ఉంచి, హీట్ చేయాలి.
8. టైమ్ అయిన తర్వాత ఓవెన్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వేడిగా లేదా చల్లగా కుటుంబ సభ్యులతో పాటు క్రిస్మస్ వచ్చిన అథితులను ఆతిద్యం ఇవ్వాలి . అంతే టేస్టీ మఫిన్ రిసిపిలు రెడీ.



Click it and Unblock the Notifications











