Latest Updates
-
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే!
దీపావళి స్సెషల్ అరిసెలు

బియ్యం: 1/2kg
యాలకుల పొడి: 1tsp
నువ్వులు: 2tsp
బెల్లం: 1/2kg
నూనె/నెయ్యి: వేయించడానికి సరిపడా
పిండికోసం:
1. బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలి. నీళ్లను వంపేసి నీడనే పొడిబట్టమీద బియ్యాన్ని ఆరనివ్వాలి.
2. తడిబియ్యం మూడువంతులు ఆరినాక మిల్లు పట్టించాలి. అంతేతప్ప పొడిబియ్యాన్ని మాత్రం పిండి పట్టడానికి వాడకూడదు.
3. బియ్యం కడిగి ఆరబెట్టే సమయం లేకపోతే బియ్యం ఓసారి కడిగి వెంటనే మిక్సీలో వేసి మెత్తగా పిండిపట్టాలి.
తయారు చేయు విధానము:
1. మందపాటి పాత్రలో తురిమిన బెల్లం, పావుకప్పు నీళ్లు పోయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరవాత పలుచటి వస్త్రం లేదా టీ ఫిల్టర్‌తో బెల్లం నీళ్లను వడబోయాలి. ఈ నీళ్లను మళ్లీ పాత్రలో పోసి పాకం పట్టాలి. (సరైన పాకం వచ్చిందో లేదో తెలియాలంటే చిన్నప్లేటులో చల్లటినీళ్లు పోసి అందులో కొద్దిగా పాకాన్ని వేయాలి. దాన్ని వేళ్లతో తీసినప్పుడు ఉండలా అయితే పాకం వచ్చినట్లే)
2. ఇప్పుడు పాత్రను కిందకి దించి యాలకుల పొడి వేయాలి. వెంటనే బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. పాకం పిండిని పీల్చుకునేవరకూ వేయాలి.
3. చపాతీ పిండిలా అయిపోగానే ఇక పిండి వేయడం ఆపేయాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ వాటిని నెయ్యి రాసిన అరిటాకులమీద మూడు మిల్లీమీటర్ల మందాన వేళ్లతో వత్తి నూనె/నెయ్యిలో వేయించి తీయాలి. తీసిన వెంటనే అరిసెల చెక్కలు లేదా గరిటెలతో వత్తితే వాటిల్లోని నెయ్యి/నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. అంతే దీపావళి స్పెషల్ అరిసెలు రెడీ ఇవి దాదాపు పది రోజుల వరకూ నిల్వ ఉంటాయి.!



Click it and Unblock the Notifications











