Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
మ్యాంగో - ఐస్ క్రీమ్ స్మూతీ.. సమ్మర్ స్పెషల్
ఎండాకాలంలో చల్లచల్లని పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. రుచికి కూడా బాగుంటాయి. పండ్లు తినని పిల్లలకు జ్యూసుల రూపంలో ఇవ్వండి. తియ్య తియ్యగా తాగడానికి ఇష్టపడతారు. జ్యూసులలో పోషక విలువలు కూడా అధికం. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని తాగేలా మాంగో కూలర్, వాటర్ మెలన్ కూలర్ వంటి ఎన్నోరకాలు తయారు చేసుకోవచ్చు మరి. మాక్‌టెయిల్ తాగాలంటే స్టార్‌హోటల్‌కో, రెస్టారెంట్‌కో వెళ్లనవసరం లేకుండా ఇంట్లోనో వెరైటీవి తాగొచ్చు.
మామిడి కాయలంటే ఎవరికైనా ఇష్టమే. ఈ సీజన్‌లో బంగినపల్లి నుంచి అన్ని రకాల కాయలను తింటుంటాం. ఇష్టమైన జ్యూస్‌లను తయారు చేసుకుంటాం. అలాంటి మామిడి కాయలతో మ్యాంగో ఐస్ క్రీమ్ స్మూతీ ఎలా తయారు చేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
మ్యాంగో: 5-6
పాలు: 1/2cup(చల్లనివి)
పంచదార: 6-7tbsp(మామిడిపండ్ల సంఖ్యను బట్టి)
వెనీలా ఐస్ క్రీమ్: 2స్కూప్స్
నీళ్ళు: కొద్దిగా(అవసరమైతేనే)

1. ముందుగా మామిడి పండ్ల పొట్టు తీసి సన్నసన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు వీటిని మిక్సీ గ్రైండర్ లో వేసి మెత్తబడే వరకూ బ్లెండ్ చేసుకోవాలి.
3. తర్వాత ఇందులో పంచదార కూడా వేసి ఒక నిముషం పాటు మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ ను ఒక బౌల్లోనికి వంచుకోవాలి. ఇప్పుడు దీనికి చల్లటి పాలను మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసి స్మూతీ తయారు చేసుకోవాలి.
4. చివరగా వెనీలా ఐస్ క్రీమ్ ను కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసి బాగా షేక్ చేయాలి. అంతే మ్యాంగో స్మూతీ రెడీ. దీన్ని జ్యూస్ గ్లాస్ లో నింపి చల్ల.. చల్లగా అందించడమే ఆలస్యం.



Click it and Unblock the Notifications











