ఓట్స్ క్యారెట్ హల్వా: స్వీటీ అండ్ హెల్తీ

మనమందరం క్యారెట్ హల్వాను చాలా సార్లే టేస్ట్ చేసి ఉంటాము . అయితే క్యారెట్ హల్వాలో కొన్నిఆరోగ్యకరమైన పదార్థాలు (ఓట్స్) జోడించడం వల్ల ఏమవుతుంది.? హల్వ టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా. ఎందుకంటే లోక్యాలరీలు కలిగిన ఓట్స్ ను హల్వాలో జోడించడం వల్ల టేస్ట్ గా ఉంటుంది. కొద్దిగా తిన్నా పొట్ట నిండుగా టేస్ట్ బడ్స్ ను సంత్రుప్తిపరుస్తాయి.

క్యారెట్స్ లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి. మరియు ఓట్స్ లో డైటరీ ఫైబర్ కూడా ఎక్కువే..ఇంకా ప్రోటీన్స్, విటమిన్స్ మరియు మినరల్స్ కూడా కలిగి ఉన్నాయి. ఈ రెండు ఆహార పదార్థాల కాంబినేషన్ తో తయారుచేసే హల్వ చాలా రుచికంగా ఉంటుంది. మరి ఓట్స్ అండ్ క్యారెట్ హల్వాను ఎలా తయారుచేయాలో చూద్దాం...

oats carrot halwa

కావల్సిన పదార్థాలు:
ఓట్స్ -1 ½ cup
వెన్న తీసిన పాలు - 500 ml
క్యారెట్స్- 300 gms
షుగర్ - 1/4th cup
కోవ - 100 gms
యాలకల పొడి - a pinch

తయారుచేయు విధానం:
1. ముందుగా క్యారెట్ ను శుభ్రం చేసి తర్వాత తురుముకోవాలి. తురుముకొన్న క్యారెట్ ను మిక్సీలో వేసి మరింత రఫ్ గా గ్రైడ్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో పాలు పోసి, కాగిన తర్వాత అందులో గ్రైడ్ చేసుకొన్న క్యారెట్ మరియు ఓట్స్ వేసి మిక్స్ చేయాలి.
3. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో ఫ్రెష్ కోవా వేయాలి. వేసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ ఉడికించుకోవాలి.ః
4. కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో సరిపడా పంచదార వేసి మిక్స్ చేయాలి.
5. తర్వాత మరో పాన్ స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి వేడి అయిన తర్వాత అందులో యాలకలు, చిటికెడు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి.
6. ఫ్రై అయి, చల్లబడిన తర్వాత యాలకలు, దాల్చిన చెక్కను పొడి చేసి క్యారెట్ ఓట్స్ హల్వాలో వేసి బాగామిక్స్ చేయాలి.
7. క్యారెట్ ఓట్స్ హల్వా మొత్తం రెడీ అయిన తర్వాత అందులో బాదం పలుకులు గార్నిష్ గా వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ ఓట్స్ హల్వా రెడీ...

Story first published: Saturday, July 25, 2015, 16:08 [IST]
Desktop Bottom Promotion