Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
పన్నీర్ జామూన్

పన్నీరు - 250 గ్రా
పచ్చి కోవా -150గ్రా
మైదా - 1 కప్పు
డాల్డ -10 గ్రా
కుంకుమ పువ్వు- 5గ్రా
బాదాంపప్పు -50 గ్రా
చక్కెర - 1/2 కేజి
పాలు -1/2 లీటరు
యాలకులు- 4
తయారు చేయు విధానము:
ముందుగా పన్నీరుని తురిమి పెట్టుకొవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కోవా, పన్నీరు తురుము, చక్కెర, మైదా వేసి పాలు పోస్తూ జామూన్ పిండిలా ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో చెక్కర వేసి పాకం వచ్చేలా కాగనివ్వాలి. ఇప్పుడు పాకం తయ్యారయ్యే లోపు మరొక పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె, డల్డాను సమపాళ్లలో ఉండలు మునిగేలా వేసి నూనె కాగనివ్వాలి. ఇంతలో పాకం రెడీ అవుతుంది. ముందే కలిపి పెట్టకొన్న ముద్దలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొంటూ చేత్తో ఉండలుగా చేయాలి. ఇలా తయారైన ఉండలను కాగే నూనెలో వేసి ఎరుపు రంగు వచ్చే వరుకు సన్నని మంట మీద వేగ నివ్వాలి. అలా తయారైన వుండలని తీసి చక్కెర పాకంలో వేయాలి. మరొక చిన్నని గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టి పాలు బాగా కాగనివ్వాలి పాలు కాగే సమయంలో అందులో కొద్దిగా చక్కెర, ఏలకుల పొడిని, కుంకుమపువ్వు వేసి పక్కకు దింపి పెట్టుకోవాలి. చక్కర పాకంలో నానిన ఉండలు తీసి పాలు పాకం లో వేసి బాదం పప్పు ముక్కలని చల్లి సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











