Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
బంగాళదుంప-వెల్లుల్లి సలాడ్ ఫర్ వెయిట్ లాస్
లోకొలెస్ట్రాల్ ఫుడ్ తినాలనుకుంటున్నారు, నూనె లేకుండా లేదా చాలా తక్కువ నూనెతో తయారుచేసే వంటలు తినడం వల్ల ముఖ్యంగా హార్ట్ కు చాలా మంచిది. బరువు తగ్గించడానికి బంగాళదుంప మరియు వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతాయి. ముఖ్యంగా 35ఏళ్ళు దాటిన మహిళలకు ఈ కాంబినేషన్ చాలా మంచిది.సాధారణంగా 30ఏళ్ళు దాటిన మహిళలు తరచూ అనారోగ్యానికి గురిఅవుతుంటారు.వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఇలా జరగుతుంది. కాబట్టి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇటుంటి ఆహారాలు గొప్పగా సహాయపడుతాయి.
ఈ బంగాళదుంప మరియు గార్లిక్ సలాడ్ మీకు బెటర్ లైఫ్ ను ఇవ్వడం మాత్రమే కాదు, వయస్సైయ్యే కొద్ది, వ్యాధుల బారీన పడకుండా రక్షణకల్పిస్తుంది . పొటాటో గార్లిక్ సలాడ్ కు ప్రధానంగా రెండు పదార్థాలు అవసరం అవుతాయి. అలాగే వీటితో పాటు, పెరుగు మరియు కొన్ని మసాలాలు కూడా జోడించడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. ఇది రుచికరం మాత్రమే కాదు, పొట్ట నింపే రిసిపి కూడా...

కావల్సిన పదార్థాలు :
వెల్లుల్లి: 1tbsp
నిమ్మరసం: 1tsp
పెరుగు: 2tbsp
మిల్క్ పౌడర్: 1tsp
ఆవాలు: 1/2tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: చిటికెడు
కావల్సిన పదార్థాలు 2:
పాలక్(పాలకూర): 1cup(సన్నగా తరిగినవి)
బంగాలదుంప: 2cups(ఉడికించుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా సిద్దం చేసుకొన్న పదార్థాలు లిస్ట్ 1 లోనివి మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి రిఫ్రిజరేటర్లో పెట్టుకోవాలి.
2. కొద్దిసేపటి తర్వాత ఫ్రిజ్ లో నుండి వాటిని బయటకు తీసి పెట్టాలి. తర్వాత పాలకూర తరుగును ఐస్ కోల్డ్ వాటర్ బౌల్లో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత అధికంగా ఉన్ననీటిని పైపైన వంపేసుకోవచ్చు. తర్వాత ఆకుకూర మెత్తబడే వరకూ అలాగే ఉంచాలి.
3. ఇప్పుడు ముందుగా ఉడికించుకొన్న బంగాళదుంపలను తీసుకొని ఫ్లాట్ స్పూన్ తో స్మాష్ చేయాలి. వీటిని కూడి 15నిముషాలు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చల్లగా మారుతుంది.
4. 15నిముషాల తర్వాత, బంగాలదుంపలను బయటకు తీసి ఆకుకూరలున్నబౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత పైన కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మొదట సిద్దం చేసుకొన్న పదార్థాల 1మిక్సింగ్ బౌల్లో పాదర్థాలను తీసుకొని గార్నిషింగ్ గా వేసుకోవాలి.
6. ఈ మొత్తం పదార్థాలన్నీ బాగా కలిసేట్లు కలుపుకోవాలి. అంతే వెయిట్ లాస్ పొటాటో గార్లిక్ సలాడ్ రెడీ.



Click it and Unblock the Notifications











