Latest Updates
-
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా?
షుగర్ లెస్ క్రిస్మస్ కేక్: డయాబెటిక్ స్పెషల్
క్రిస్మస్ రోజున హెల్తీ ఫుడ్స్ తిని, హెల్తీగా ఉండటానికి ప్రయత్నించండి. మరియు మీరు డయాబెటిక్(మధుమేహ వ్యాధి)తో బాధపడుతున్నట్లైతే, ఈ షుగర్ లెస్ క్రిస్మస్ కేక్ మీ డయాబెటిక్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.
ఈ క్రిస్మస్ కేక్ ను ఫ్రూట్ కేక్ అని కూడా పిలుస్తారు . ఈ క్రిస్మస్ కేక్ ను పంచదార ఉపయోగించకుండా తయారుచేస్తారు. మరి ఈ డయాబెటిక్ స్పెషల్ క్రిస్మస్ కేక్ ను ఎలా తయారుచేయాలా చూద్దాం....

ఎండు ద్రాక్ష్: 2cups
బ్రాందీ: 2tsp
నీళ్ళు: 11/2tsp
గుమ్మడి గుజ్జు: 1cup(తీపికోసం)
గుడ్డు: 2(పగులగొట్టి, గిన్నెలో వేసి, బాగా గిలకొట్టాలి)
ఆపిల్ సాస్: 1/2cup
బాగా కాచి వెన్న తీసిన పాలు: 1/2cup
మీకు నచ్చిన నట్స్ : 1/2cup(పొడి చేసుకోవాలి)
దాల్చిన చెక్క : 1tsp(పొడి చేసుకోవాలి)
పుడ్డింగ్ స్పైస్: 1tsp
మైదా : 1cup
బేకింగ్ సోడ: చిటికెడు
తయారుచేయు విధానం:
1. ముందుగా ఎండు ద్రాక్షణ బ్రాందీలో వేసి, రాత్రంతా నానబెట్టుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో గుమ్మడిగుజ్జు, గిలకొట్టపెట్టుకొన్న గుడ్డు, ఆపిల్ సాస్ మరియు పాలు వేసి బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత అందులోనే బ్రాందీలో నానబెట్టుకొన్న ద్రాక్ష, నట్స్, మరియు స్పైసీ మరియు మైద, బేకింగ్ సోడా అన్నింటిని వేయాలి. అలాగే మీకు బిట్టర్ రుచి ఇష్టం అయినట్లైతే ఒక చెంచా బ్రాంది కూడా మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్నింటిని స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.
4. తర్వాత కెక్ టిన్ లో కొద్దిగా నూనె రాసి, దాని మీద వాక్స్ పేపర్ ను చుట్టి పెట్టాలి.
5. తర్వాత ఓవెన్ ను 250డిగ్రీలలో ప్రీహీట్ చేయాలి.
6. తర్వాత అందులో కేక్ టిన్ పెట్టి 10నిముషాల పాటు 200సెంటీగ్రేడ్ వద్ద బేక్ చేయాలి. తర్వాత ఓవెన్ ను 180సెంటీగ్రేడ్ కు తగ్గించి మరో 10నిముషాలు బేక్ చేయాలి. అంతే సర్వ్ చేయాడినికి టేస్టీ సుగర్ లెస్ కేక్ రిసిపి రెడీ.
ఈ టేస్టీ క్రిస్మస్ కేక్ తిని హెల్తీగా మరియు దీర్ఘకాలం జీవించండి.



Click it and Unblock the Notifications











